Breaking News

డెవర్లే... రైతులుగా...

Published on Sun, 03/29/2026 - 10:52

కేరళ కోజికోడ్‌లోని ఆటోడ్రైవర్లకు ఇంట్లో భోజనం చేసే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్‌లలో తినేవారు. ఖర్చు కళ్లు తిరిగేలా ఉండేది. ఇలా అయితే కుదరదనుకొని డ్రైవర్లందరూ కలిసి ఒక చోట సొంతంగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సూపర్‌ హిట్‌ అయింది.

డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యం కూడా!
ఇప్పుడు ఈ డ్రైవర్లు సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులుగా మారి మరోసారి సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. భూస్వామి కోలకట్టిల్‌ బీజు దగ్గర భూమి లీజు తీసుకొని రైతుగా తొలి అడుగు వేశారు. ‘డ్రైవింగ్‌ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.తమ జీవనోపాధిని పణంగా పెట్టి బీడు నేలలోకి పాదం మోపారు.తెల్లవారుజామున తొలి వెలుగుతోనే పొలం పనులకు శ్రీకారం చుట్టేవారు. ఆ తరువాత డ్రైవర్‌గా రోడ్డు మీదికి వెళతారు. మళ్లీ సాయంత్రం ఇష్టంగా పొలంలోకి వస్తారు. రోజంతా ట్రాఫిక్‌ పొగల మధ్య ఉండే వారికి పచ్చటి పొలాల మధ్య ఉండడం ఇష్టం. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే...డ్రైవర్‌గా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పొలంలోనే ఉంటారు. తమ రెక్కల కష్టంతో పాలకూర, పప్పుధాన్యాలు, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి పలు రకాల పంటలతో పచ్చని కూరగాయల తోటను సృష్టించారు. పంట సాగు చేయడానికి అవసరమైన డబ్బులను తామే సమకూర్చుకున్నారు. అత్యున్నత శ్రేణి విత్తనాలు, సహజ ఎరువులతో పంట పండించారు. 

అకాల వర్షాలు కురిసినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేనులో కోసిన కూరగాయలను ఇంటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు, మార్కెట్‌ ధరకు వాటిని అమ్ముకున్నారు. ‘డ్రైవర్‌గా మాకు లైసెన్స్‌ ఉంది. ఇక రైతుగా మా లైసెన్స్‌... మేము పడే కష్టం’ అంటున్నాడు చంద్రశేఖరన్‌. ‘రోజంతా హారన్లు మోగించే మేము మొక్కలకు నీరు పోయడం పని కాదు. ప్రశాంతత’ అంటున్నాడు అబ్దుల్‌ రహీం. 

‘జాతీయ రహదారిపై దొరకని విలువైన నిశ్శబ్దం ఇక్కడ దొరుకుతుంది’ అంటున్నాడు మహేష్‌ అనే రైతు. తాజా విషయానికి వస్తే... ఈ డ్రైవర్‌ రైతులు పెద్ద పంటలపై దృష్టి పెట్టారు. భవిష్యత్‌ కాలంలో వారు పూర్తిస్థాయి రైతులుగా మారినా ఆశ్చర్యం లేదు! ‘డ్రైవింగ్‌ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు. 

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)