రంగులే కాదు.. పండ్లు, బురదతోనూ రచ్చ

Published on Sun, 03/01/2026 - 07:41

మనదేశంలో ఉత్సాహంగా చేసుకునే రంగుల పండుగ హోలీ.. కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. వసంత కాలం రాకను స్వాగతిస్తూ, ప్రకృతి తన రంగులను అద్దుకుంటున్న వేళ.. కులమతాలకు అతీతంగా, శత్రుత్వాలను మరిచి, అందరూ ఒక్కటయ్యే అద్భుత ఘట్టం ఇది. పురాణాల ప్రకారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ. వీధుల్లో అందరి మీదా జల్లుకునే రంగురంగుల పొడులు, నీటి జల్లులు, గులాల్‌తో నిండిన గాలి.. మొత్తంగా  భారతీయుల ఐక్యతకు ఈ ఉత్సవం అద్దం పడుతుంది.

రంగులతో ఆడే ఈ సరదా ఉత్సవం మనుషులను కలిపే ఒక అద్భుత వేడుక అని చెబుతుంటారు.  ఇది భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లతో, రంగులకు బదులు పండ్లు, బురద, వైన్ లేదా నీటిని  వినియోగిస్తూ అచ్చం మన హోలీని తలపించే ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నాయి. రూపం ఏదైనా, ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే.. అదే ‘జీవన ఉల్లాసం..సామూహిక సంతోషం'. అచ్చం హోలీ తరహాలో సాగే ఆ  ఏడు అంతర్జాతీయ వింత పండుగలేంటో ఇప్పుడు చూద్దాం..

1. సోంగ్‌క్రాన్ - థాయ్‌లాండ్ (Songkran) 
థాయ్ నూతన సంవత్సరం సందర్భంగా జరిగే ఈ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ఉత్సవ యుద్ధం. వీధుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందిస్తారు. ఇది గతంలో చేసిన పాపాలను, దురదృష్టాన్ని కడిగేసే పవిత్ర స్నానంగా వారు భావిస్తారు.

2. లా టొమాటినా - స్పెయిన్ (La Tomatina) 
స్పెయిన్‌లోని బునోల్ నగరంలో జరిగే ఈ టమోటా యుద్ధం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వందల టన్నుల టమోటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ, నగరాన్ని ఎరుపు రంగులోకి మార్చేస్తారు. ఇది హోలీలోని అల్లరిని, చిలిపిదనాన్ని తలపిస్తుంది.

3. బార్యోంగ్ మడ్ ఫెస్టివల్ - దక్షిణ కొరియా (Mud Festival) 
రంగులకు బదులు ఇక్కడ బురదతో ఆడుకుంటారు. డెచాన్ బీచ్‌ దగ్గర రంగురంగుల బురదలో కుస్తీలు పడుతూ, పసిపిల్లల్లా మారిపోయి అందరూ ఎంజాయ్ చేస్తారు. మొదట సౌందర్య సాధనాల ప్రచారంగా మొదలైన ఈ వేడుక ఇప్పుడు భారీ ఉత్సవంగా మారింది.

4. బ్యాటిల్ ఆఫ్ ది ఆరెంజెస్ - ఇటలీ (Battle of the Oranges)
ఇటలీలో 1808 నుండి సాగుతున్న ఈ సంప్రదాయంలో నారింజ పండ్లతో యుద్ధం చేస్తారు. సుమారు 400 టన్నుల నారింజ పండ్లను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. రంగులు కాకపోయినా, పండ్ల రసంతో వీధులన్నీ ఆహ్లాదంగా మారుతాయి.

5. హారో వైన్ ఫెస్టివల్ - స్పెయిన్ (Haro Wine Festival) 
స్పెయిన్‌లోని హారో పట్టణంలో ప్రజలు బకెట్ల కొద్దీ వైన్‌ను ఒకరిపై ఒకరు పోసుకుంటూ వేసవికి స్వాగతం పలుకుతారు. ఇది హోలీలో రంగు నీళ్లను చల్లుకున్నట్లే ఎంతో ఉత్సాహంగా సాగుతుంది.

6. చించిల్లా వాటర్ మెలన్ ఫెస్టివల్ - ఆస్ట్రేలియా (Watermelon Festival)
క్విన్స్‌ల్యాండ్‌లో జరిగే ఈ పండుగలో అంతా పుచ్చకాయల హడావుడే! పుచ్చకాయలపై నుంచి జారడం, వాటిని పగలగొట్టడం వంటి వింత పోటీలతో పర్యాటకులు వినోదంలో మునిగితేలుతారు.

7. కాస్కమోరాస్ - స్పెయిన్ (Cascamorras) 
స్పెయిన్‌లోని గ్వాడిక్స్ ప్రాంతంలో జరిగే ఈ ఉత్సవం అచ్చం మన హోలీనే అని చెప్పుకోవచ్చు. చరిత్ర ప్రకారం మేరీ మాత విగ్రహం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలు ఒకరిపై ఒకరు గ్రీజు, రంగుల పొడులు పూసుకుని రచ్చ రచ్చ చేస్తారు.

ఇది కూడా చదవండి: హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!

#

Tags : 1

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)