Breaking News

ఆ ఒక్క కొబ్బరికాయ రూ. 2.55 లక్షలా..?! ఎందుకో తెలుసా..

Published on Thu, 11/19/2026 - 12:33

తమిళనాడులో ఒక ఆలయంలో జరిగిన వేలం పాటలో ఒక కొబ్బరికాయ  ఏకంగా రూ. 2..55 లక్షలకు అమ్ముడుపోయింది. సాధారణ స్వామి నైవేద్యం అనూహ్యంగా అంత ధర పలకడం చర్చనీయాంశంగా మారింది. భక్తుల మధ్య తీవ్ర పోటీ కారణంగా ఈ ధర పలికినట్లు స్థానికులు చెబుతున్నారు. అసలు ఏంటి ఆ కొబ్బరికాయ మహత్యం..అంత డబ్బు వెచ్చించి మరి భక్తులు కొనేందుకు ఆసక్తి చూపడానికి కారణం ఏంటి అంటే..

తమిళనాడులో బోడినాయకనూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సోమవారం ఈ వేలం జరిగింది. సుమారు 30 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రూ. 11 వేలుతో మొదలైన వేలం భక్తుల పోటీ తీవ్రత భారీ ధరను పెంచిందని చెబుతున్నారు స్థానికులు. బోడినాయకనూరుకు చెందిన గుణశేఖరన్ అనే వ్యక్తి రూ. 2.45 లక్షల వరకు ధరను పెంచారు. 

అయితే మధురై సమీపంలోని చెల్లంపట్టికి చెందిన రేణుక, రూ. 2.55 లక్షలు చెల్లించి వేలంపాటలో విజేతగా నిలిచారు. వేలం ముగిసిన వెంటనే ఆలయ అధికారులు, ఆమె కుటుంబ సభ్యులను పూలమాలతో సత్కరించి, ఆ పవిత్ర కొబ్బరికాయను వారికి అందజేశారు. సాధారణంగా ఈ కొబ్బరికాయ ధర కేవలం రూ. 55/-మాత్రమే. 

అంత ధర ఎందుకు పలికిందంటే..
ఇది అలాంటి ఇలాంటి కొబ్బరికాయ కాదు. సుబ్రమణ్యస్వామి(మరుగన్‌), వల్లి, దేవసేనల దివ్య వివాహ వేడుకలో ఉపయోగించారు. అంతేకాకుండా ఈ కొబ్బరికాయకు పవిత్రమైన 'తిరుమాంగల్యం' (మంగళసూత్రం) కూడా ఉంచారు. దీనివ వల్ల భక్తులు దీనిని అత్యంత పవిత్రమైనది భావిస్తారు. 

అదీగాక ఈ కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్లి పూజిస్తే..ఎంత మేలు జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఇది ఇంట్లో ఐశ్వర్యాన్ని అందిస్తుందని, వివాహం కాని వారికి తగిన జీవిత భాగస్వామి దొరికేలా చేస్తుందని, సంతానం లేని దంపతుకు సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం. కాగా, నవంబర్‌ 10న తమిళనాడు అంతటా 'కంద షష్ఠి' ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

ఆ ఉత్సవాల్లో భాగంగా ఈ సోమవారం స్వామి వారికి  'తిరుకల్యాణం' నిర్వహించారు. ఆ వేడుక అనంతరం ఆ కళ్యాణంలో ఉపయోగించిన కొబ్బరికాయ కోసం వేలం నిర్వహించారు. అలా ఏటా ఈ ఒక్క కొబ్బరికాయ వేలం ప్రధాన ఆకర్షణగా మారి, అందరూ పోటీపడి కొనుక్కునేందుకు కారణమవుతోంది. ఇప్పటి వరకూ.. గతేడాది రూ. 2 లక్షలకు అమ్ముడుపోగా, అంతకుమునుపు ఏడాది ఏకంగా రూ. 3.03 లక్షలు పలికినట్లు సమాచారం. 

కందషష్ఠి ఉత్సవాలు ఎందుకంటే..
రాక్షస రాజు సూరపద్మునిపై స్వామి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ మరుగన్‌(సుబ్రమణ్య స్వామికి) ఆరు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చివరి ముగింపు ఘట్టం రోజు అంటే స్కంద షష్టి రోజున తమిళనాడు వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది భక్తులు మరుగన్‌ ఆలయానికి తరలివచ్చి..ఈ పవిత్రమైన కళ్యాణాన్ని వీక్షిస్తూ స్తోత్రాలు, కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. 

అంతేగాదు స్వామి సూరసంహరం చేసింది సముద్ర తీరంలో ఉన్న తిరుచెందూరులో అట. అక్కడకి భక్తులు మరింత పోటెత్తుతారని చెబుతున్నారు. ఆ సమయంలో స్వామి వారి ముందుకు వస్తే..కళ్ల నుంచి ధారళంగా నీళ్లు వస్తాయని పలవురు భక్తులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: కర్బీ నృత్యంతో అద్భుత రికార్డు..ఒకేసారి 15 వేల మందికి పైగా..
 

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)