Breaking News

బాబోయ్‌ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!

Published on Tue, 09/10/2024 - 15:20

మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు  కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల  వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి  చేరిపోయిందొక బొద్దింక.  ఏదో  అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్‌ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.

బొద్దింకను ఎలా  గుర్తించారు?
ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని  సీటీ స్కాన్‌, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్‌ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్‌ బొద్దింక అంటున్నారు నెటిజన్లు.

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)