Breaking News

ప్రాంక్‌ కాల్‌..

Published on Sun, 07/26/2026 - 08:54

బిజినెస్‌మేన్‌ సారథి ఆఫీస్‌ పనిలో బిజీగా ఉన్నాడు. సరిగా అదే సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. సారథి ఫోన్‌ తీశాడు. అవతలి వ్యక్తి గొంతులో కరుకుదనం... ‘నీ కొడుకు రిత్విక్‌ను కిడ్నాప్‌ చేశాం. ఒక గంటలో పది లక్షల రూపాయలు తీసుకుని స్టార్‌  బేకరీ దగ్గరికి రా. పోలీసులకు చెబితే నీ కొడుకు ప్రాణాలు ఉండవు’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.

రిత్విక్‌ తన ఫ్రెండ్‌ బెనర్జీ ఇంటికి వెళ్తానని చెప్పాడు. వెంటనే సారథి బెనర్జీకి ఫోన్‌ చేశాడు. రిత్విక్‌ తన దగ్గరికి రాలేదని చెప్పాడు.
సారథికి కాళ్లూ చేతులూ ఆడలేదు. పెళ్ళైన పదేళ్లకు లేకలేక పుట్టిన కొడుకు. ఇంకేమీ ఆలోచించలేదు. డబ్బులు సూట్‌ కేసులో పెట్టుకుని స్టార్‌ బేకరీ దగ్గరికి వెళ్ళాడు. కానీ కిడ్నాపర్‌ జాడ లేదు. ఐదు...  పది నిమిషాలు... అప్పుడే నవ్వుతూ ఎదురొచ్చాడు బెనర్జీ. వెంటనే ఆందోళనగా ‘నువ్వేంటి ఇక్కడ?’ అంటూ కొడుకు కిడ్నాప్‌ అయిన విషయం చెప్పి, పది లక్షలు ఉన్న సూటుకేసు చూపించాడు సారథి.

వెంటనే బెనర్జీ నవ్వడం మొదలుపెట్టాడు.
నిజానికి అది స్నేహితుడు బెనర్జీ ఆడిన ఒక క్రూరమైన ‘ప్రాంక్‌ కాల్‌’ నాటకం. 
రిత్విక్‌ను స్టార్‌  బేకరీకి తీసుకువెళ్లి, అక్కడ కూర్చోబెట్టి సారథిని భయపెట్టాలని బెనర్జీ ప్లాన్‌ వేశాడు.
కానీ అప్పుడే అనూహ్య సంఘటన జరిగింది. రిత్విక్‌ నిజంగానే కిడ్నాప్‌ అయ్యాడు.
∙∙ 
ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న రంగంలోకి దిగాడు.
ప్రాంక్‌ కాల్‌ చేసిన ఫ్రెండ్‌ బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారించాడు. బెనర్జీ ఏడుస్తూ, ‘సార్, నేను కేవలం సరదా కోసమే ఫోన్‌ చేశాను. బేకరీలోనే బాబు ఉన్నాడు, ఇంతలోనే ఏమైందో తెలియదు’ అని చెప్పాడు.
ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న వెంటనే బేకరీలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాడు. అందులో ముఖానికి మాస్క్‌ ధరించిన ఒక వ్యక్తి రిత్విక్‌ను తన వెంట తీసుకువెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రద్యుమ్న చుట్టుపక్కల విచారణ మొదలుపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లభించలేదు. అనుమానాస్పదంగా కూడా ఎవరూ కనిపించలేదు. వాడెవరా అని ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ప్రద్యుమ్న పోలీస్‌ బుర్ర శరవేగంగా పనిచేయడం ప్రారంభించింది. కిడ్నాప్‌ చేసినవాడికి ఏమైనా క్రిమినల్‌ రికార్డు ఉందా అని అనుమానించాడు.  
ఆ వ్యక్తి నడక, శైలిని బట్టి ప్రద్యుమ్న తన పోలీస్‌ డేటాబేస్‌ను తనిఖీ చేయగా, వాడు పాత క్రిమినల్‌ అని క్లూ దొరికింది. రిత్విక్‌ ఒంటరిగా బేకరీలో కనిపించేసరికి కిడ్నాప్‌ చేశాడు.
కానీ వాడు ఎటు వెళ్లాడో తెలుసుకోవడం ఎలా? ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న ఒక అద్భుతమైన ప్లాన్‌ వేశాడు. కిడ్నాపర్‌ బేకరీకి వచ్చినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్‌ చేసి ఉంటాడని భావించి, ఆ సమయానికి సంబంధించిన బేకరీ బిల్స్, కౌంటర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ చెక్‌ చేశాడు. ప్రద్యుమ్న అనుకున్నట్లే, మాస్క్‌ ధరించిన ఆ క్రిమినల్‌ బేకరీలో బిల్లు చెల్లించడానికి తన మొబైల్‌ నుంచి ‘గూగుల్‌ పే’ చేసినట్లు గుర్తించాడు.
వెంటనే ఆ ‘గూగుల్‌ పే’ లావాదేవీకి సంబంధించిన మొబైల్‌ నంబర్‌ను ట్రేస్‌ చేయాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ను ఆదేశించాడు ప్రద్యుమ్న.

కేవలం పది నిమిషాల్లో ఆ నంబర్‌ లొకేషన్‌ నగర శివార్లలోని ఒక నిర్జన ప్రదేశాన్ని చూపించింది. ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న తన టీమ్‌తో కలిసి మెరుపు వేగంతో ఆ స్థావరంపై దాడి చేశాడు. రిత్విక్‌ నోటికి ప్లాస్టర్‌ వేసి బంధించిన ఆ పాత క్రిమినల్‌ను గన్‌ పాయింట్‌లో లొంగదీసుకుని, రిత్విక్‌ను సురక్షితంగా కాపాడాడు. అసలు కిడ్నాపర్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాత, ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న బెనర్జీ వైపు సీరియస్‌గా చూశాడు. ‘చూశావా బెనర్జీ! కుటుంబ సభ్యులతో... స్నేహితులతో సరదాగా ఆడుకునే ఈ ప్రాంక్‌ కాల్స్‌ చాలాసార్లు ప్రమాదాలను  తెచ్చి పెడుతుంది. సరదాకు ఒక లిమిట్‌ ఉంటుంది... నీ వెర్రి సరదా ఈరోజు ఒక పాత క్రిమినల్‌కు ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందో!’ అని హెచ్చరించాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న. బెనర్జీ తలదించుకుని క్షమాపణలు కోరాడు.

- శ్రీసుధామయి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)