Breaking News

చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!

Published on Thu, 10/16/2025 - 13:08

దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.

వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్‌ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్‌లోని సింథాన్‌ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. 

అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. 

ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్‌ చేశారు. 

అలాగే ఈ ముద‍స్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్‌ఏఓ ప్రతినిధి ప్రియామీనన్‌ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.

(చదవండి: Success Story: ఆఫీస్‌ బాయ్‌ నుంచి సీఈవో రేంజ్‌కి..! ఏకంగా డిజైన్‌ దిగ్గజం కాన్వాతో..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)