చిన్న ప్రపంచంలో పెద్ద వెలుగులు

Published on Sun, 12/21/2025 - 01:05

క్రిస్మస్‌ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్‌బౌల్‌లో మినియేచర్‌ డెకర్‌ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్‌ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్‌ డెకర్‌ బౌల్‌ను టేబుల్, షెల్ఫ్, కార్నర్‌లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్‌ క్రిస్మస్‌ డెకర్‌ బౌల్స్, జార్స్‌ రెడీమేడ్‌గా మార్కెట్‌లోనూ దొరుకుతున్నాయి.

గ్లాస్‌ బౌల్‌ డెకర్‌
పారదర్శకంగా ఉండే క్రిస్మస్‌ మినియేచర్‌ బౌల్స్, జార్స్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. 

ఆకాశమే హద్దు... 
నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్‌ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్‌ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్‌ ఆర్ట్‌కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్‌ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్‌ ఫిగర్స్, పైన్‌కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్‌ఈడీ ఫెయిరీ లైట్స్‌తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు. 

స్నో గ్లోబ్‌ స్టయిల్‌
తెల్లటి ఫేక్‌ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్‌ ఫిగర్‌తో మినిమలిస్టిక్‌ లుక్‌ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు. 

క్రిస్మస్‌ విలేజ్‌ థీమ్‌
చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్‌ పాత్, ఎల్‌ఈడీ స్ట్రీట్‌ ల్యాంప్స్‌తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు. 

ఎక్కడ ఉంచాలంటే.. 
సిద్ధం చేసుకున్న మినియేచర్‌ క్రిస్మస్‌ బౌల్‌ను లివింగ్‌ రూమ్‌లో సెంటర్‌ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్‌సైడ్‌ లాంప్‌ పక్కన, డైనింగ్‌ టేబుల్‌ సెంటర్‌ పీస్‌గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్‌ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. 
- ఎన్నార్‌

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)