Breaking News

నాగేంద్రుడి ఐదు పడగలు.. ఏడు రక్షణ వలయాలు.. ఎన్నో వింతలు!

Published on Thu, 11/12/2026 - 09:08

ప్రసిద్ధ చిత్రదుర్గ కోట ప్రధాన ప్రవేశ ద్వారపు గోడపై ఐదు పడగల నాగేంద్రుడి అద్భుతమైన శిల్పం అచ్చెరువు గొల్పుతుంది. హిందూ సంస్కృతిలో నాగేంద్రుడిని ఆదిశేషుని రూపంగా భావిస్తూ దేవాలయాలు, కోటల ద్వారాల వద్ద రక్షణకు చిహ్నంగా పూజిస్తారు.

కోటను శత్రువుల నుండి రక్షించడానికి లోపలి ప్రాంతం పవిత్రమైనదని సూచించడానికి ఈ శిల్పాన్ని చెక్కేవారు. పాము తల భాగానికి ఎడమ వైపున శివుని వాహనమైన నంది విగ్రహం పైభాగంలో అమృత కలశం ఉండడం శుభానికి, అమరత్వానికి, సంపదకు సంకేతాలని విశ్వాసం. పాము వంకరల ఆకారం చిత్రదుర్గ కోట రక్షణ గోడల నిర్మాణ శైలిని పోలి ఉండటంతో శత్రువులను గందరగోళానికి గురిచేసే వ్యూహాన్ని ఇది సూచిస్తుందని చరిత్రకారులు పేర్కొంటారు.

చిత్రదుర్గ కోట దాదాపు వెయ్యి సంవత్సరాల ఘనమైన చారిత్రక నేపథ్యం కలిగిన అజేయమైన కట్టడం. కర్ణాటకలోని వేదవతి నది మైదానంలో ఉన్న దట్టమైన గ్రానైట్‌ కొండలపై సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట విస్తరించి ఉంది. దీనిని కన్నడంలో కల్లిన కోట అంటే రాతి కోట అని ఏడు రక్షణ వలయాలు ఉండటం వల్ల ఏడు చుట్ల కోట అని పిలుస్తారు. ఈ ప్రాంతం 10వ శతాబ్దంలో రాష్ట్రకూటుల ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 11 నుండి 13వ శతాబ్దాల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు, హొయసలులు ఈ కొండలపై ప్రాథమిక రక్షణ నిర్మాణాలను ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం ఈ చారిత్రక కోట భారత పురావస్తు శాఖ ఆధీనంలో జాతీయ స్మారక చిహ్నంగా సంరక్షించబడుతోంది. కోట ఉన్న చిన్ములాద్రి కొండలకు మహాభారత కాలంతో సంబంధం ఉందని నమ్ముతారు. ఇక్కడే భీముడు హిడింబాసురుడిని వధించాడని పురాణాల కథనం. దానికి గుర్తుగా కోట లోపల ప్రాచీన హిడింబేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలోని పురాతన ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా మరొక విశేష పూజాది పండుగలు నిర్వహిస్తారు.
– జిబి విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

ఇదీ చదవండి: కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి?

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)