Breaking News

భర్తతో విడాకులు.. పెళ్లికి మించిపోయేలా గ్రాండ్‌గా పార్టీ

Published on Thu, 12/14/2023 - 16:37

'ఆహ్వానం' అనే తెలుగు సినిమా మీకు గుర్తుందా? రమ్యకృష్ణ- శ్రీకాంత్‌ నటించిన ఆ సినిమాలో హీరోయిన్‌ రమ్యకృష్ణ.. పెళ్లిలాగే విడాకుల మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని ఇంటింటికీ వెళ్లి విడాకుల ఆహ్వానాన్ని అందిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలోనూ చోటుచేసుకుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ కూడా డివోర్స్‌ పార్టీ చేసుకుంది. ఇష్టంలేని బంధంలో కొనసాగే కంటే విడాకులు తీసుకొని నచ్చిన లైఫ్‌ ఎంజయ్‌ చేద్దాం అంటూ ఫ్రెండ్స్‌కి గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది. 

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. లైఫ్‌లో అన్నిటికన్నా పెళ్లి వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. తమ వివాహాన్ని ఎప్పటికి గుర్తుండేలా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. విందు, వినోదాలతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా ఓ మహిళ  విడాకుల కోసం పార్టీ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. 

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సాంగ్‌ అనే మహిళ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ ఘట్టాన్ని మరుపులేని వేడుకలా జరుపుకోవాలని భావించి సన్నిహితులకు ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఫోటోగ్రాఫర్లను కూడా పిలిపించింది. ఈ సందర్భంగా సాంగ్‌.. తన నాన్సెన్స్ మ్యారేజ్ ఇక్కడితో ముగిసిందని, మరోసారి సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

తన మాజీ భర్త మోసం చేశాడని, అతని ఫోన్‌లో మెసేజ్‌లు చూసి తట్టుకోలేకపోయానని సాంగ్‌ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని తెలిస్తే, చాలా కాలం క్రితమే డివోర్స్‌  తీసుకునేదాన్ని అని పేర్కొనడం విశేషం.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)