Breaking News

గర్ల్‌ఫ్రెండ్‌కి సిమెంట్‌ రింగ్‌తో ప్రపోజ్‌..!

Published on Fri, 07/05/2024 - 21:27

సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేసేటప్పుడూ వారి స్థాయిని బట్టి గోల్డ్‌ లేదా డైమండ్‌ రింగ్‌తో చేస్తారు. పోనీ మరీ మిడిల్‌క్లాస్‌ అయితే రోల్డ్‌ గోల్డ్‌ లేదా స్టీలు రింగ్‌తో ప్రపోజ్‌ చేస్తారు. అలా ఇలా కాకుండా ఏకంగా సిమ్మెంట్‌ రింగ్‌తో ప్రపోజ్‌ చేసి పెద్ద షాక్‌ ఇచ్చాడు ఓ వ్యక్తి. వాట్‌ సిమ్మెంట్‌ రింగా..? అని అందరూ కంగుతిన్నారు. అస్సలు అలాంటి రింగు ఉంటుందా..అని అనుకోకుండి.
ఎందుకంటే.. 

చైనాకు చెందిన 36 ఏళ్ల గ్యూయు తన గర్లఫ్రెండ్‌కి సిమ్మెంట్‌ రింగ్‌తో ప్రపోజ్‌ చేశాడు. ఈ రింగే ఇవ్వడానికి కారణం..గ్యూయూ నిర్మాణాలకు సంబంధించి వాటర్‌ ప్రూఫింగ్‌ నాణ్యత కోసం సరికొత్త సిలికాన్‌ అయాన్‌ పదార్థాన్ని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణ బీజింగ్‌ 2022 ఒలింపిక్స్‌ అరెనాలో ఉపయోగించాడరు. అంతేగాదు ఈ ఆవిష్కరణకు గానూ 2016లో సింఘువా కిహాంగ్‌ స్కాలర్‌షిప్‌ గోల్డ్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు వేడుకలోనే అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌కి తాను తయారు చేసిన ఆవిష్కరణతో చేసిన సిమెంట్‌ రింగుతో ప్రపోజ్‌ చేశాడు. 

ప్రస్తుతం వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడామె అతడి భార్య కూడా. నాటి ఆ వీడియో ప్రస్తుతం చైనీస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదండోయ్‌ గ్యూయూ తన వందేళ్ల ప్రేమ ఎన్నటికి చెక్కు చెదరదని ఈ ఉంగరం సూచిస్తుందని చెబుతున్నాడు. 

నిజంగా గ్రేట్‌ తన ఆవిష్కరణతోనే గర్లఫ్రెండ్‌కి రింగ్‌ అందించడం అనేది మర్చిపోలేని, వెలకట్టలేని గొప్ప గిఫ్ట్‌. అయితే నెటిజన్లు మాత్రం బంగారం లేదా డైమండ్‌ కాకపోయిన ఫ్యాన్సీ ఉంగరమైన పెట్టోచ్చు గదా మరీ ఇంత చీప్‌గానా? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కాగా, 2017లో,గ్యూయు గార్డెక్స్‌ను స్థాపించారు. అతని ఆవిష్కరణని నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో ఉపయోగించారు. దీన్ని ఐస్ రిబ్బన్ అని కూడా పిలుస్తారు. కేవలం దీన్ని బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్మించారు.

(చదవండి: స్కై వాటర్‌: సూర్యరశ్మి, గాలితో వాటర్‌..!)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)