Breaking News

ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాల!

Published on Sun, 01/07/2024 - 06:10

శాస్త్ర పరిశోధనలను లోతుగా సాగించడం సర్వసాధారణం. అలాగని వాటి కోసం ప్రయోగశాలలను లోతైన ప్రదేశాలలో భూగర్భంలో నిర్మించడం మాత్రం విడ్డూరమే! ఈ విడ్డూరం చైనాలోనిది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2,400 మీటర్ల లోతైన చోట నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా ఇప్పటికే గుర్తింపు పొందింది.

‘డీప్‌ అండర్‌గ్రౌండ్‌ అండ్‌ అల్ట్రా లో రేడియేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఫెసిలిటీ’ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యలాంగ్‌ రివర్‌ హైడ్రోపవర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు కలసి 2020 డిసెంబర్‌ నుంచి ఈ లాబొరేటరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిన్‌పింగ్‌ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ గురించిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ఏకంగా 120 ఒలింపిక్‌ స్విమింగ్‌ పూల్స్‌తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ఘన పరిమాణం 330,000 క్యూబిక్‌ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని గ్రాన్‌ సాసో నేషనల్‌ లాబొరేటరీ కంటే ఎక్కువే! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్‌ లాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాన్‌ సాసో లాబొరేటరీ చైనా దెబ్బకు రెండో స్థానానికి చేరుకుంది.

ఇంతకీ ఈ లోతైన భూగర్భ ప్రయోగశాలలో దేని గురించి అంత లోతైన పరిశోధనలు సాగిస్తారనుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ పదార్థం (డార్క్‌ మేటర్‌) గురించి పరిశోధనలు సాగిస్తారట! అందువల్ల ఏమాత్రం సూర్యకిరణాలు సోకని రీతిలో, రేడియేషన్‌ ప్రభావం తాకని రీతిలో దీనిని నిర్మిస్తున్నారట!. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)