Breaking News

పచ్చి కరివేపాకు నములుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి?

Published on Wed, 10/16/2024 - 15:28

సోషల్‌ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు  ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని  బాగుపడుతుందనే వార్త హల్‌చల్‌ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.

కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం.  దీంతో వంటకాలకు మంచి వాసన  రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ  దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.

బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా  చేస్తుంది
చెడు కొలస్ట్రాల్‌కు చెక్‌ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను  నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది.   ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు,  జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో  రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో  చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.

రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది.  

ఎలా తినాలి?
కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి,  అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు.
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)