Breaking News

అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్‌ వేడుకే..!

Published on Sun, 06/22/2025 - 10:12

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్‌ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్‌ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.

అదొక థీమ్‌ పార్కు. ఇంగ్లండ్‌లోని చెసింగ్టన్‌ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్‌ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్‌ వరల్డ్‌ ఆఫ్‌ అడ్వెంచర్స్‌’. ఈ థీమ్‌ పార్కులో కూడా మిగిలిన థీమ్‌ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్‌స్టార్‌ సఫారీ హోటల్‌ కూడా ఉంది. ఈ హోటల్‌లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్‌ వేడుకలు జరుగుతాయి.

ఈ హోటల్‌లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్‌ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్‌ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్‌ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్‌ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. 

గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్‌’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్‌ గదుల కారిడార్‌లో ప్రతి సాయంత్రం క్రిస్మస్‌ బ్యాండ్‌ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. 

ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్‌ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్‌ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్‌ వేషధారులు పిల్లలకు సర్‌ప్రైజ్‌ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్‌లో నిత్యక్రిస్మస్‌ గదులను బుక్‌ చేసుకుంటే, ఉచితంగా థీమ్‌పార్కు టికెట్లు ఇస్తారు. 

(చదవండి: జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫ్యాషన్‌ సీక్రెట్‌..! అదొక్కటి చాలు..)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)