Breaking News

60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్‌లుక్‌!

Published on Tue, 04/21/2026 - 13:49

వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్‌లుక్‌లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్‌ లుక్‌ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్‌ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్‌నెస్‌ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.

కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్‌నెస్‌ రొటీన్‌ గురించి అడగడం చూడొచ్చు.

మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకం
వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్‌ చేస్తానని చెప్పారు. 

ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్‌ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్‌ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. 

ప్రత్యేకంగా పాటించే డైట్‌ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్‌ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. 

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను  పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్‌గా ఉండగలుగుతామని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..)

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)