Breaking News

కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..

Published on Mon, 04/20/2026 - 11:52

సల్మాన్‌లాంటి శరీరాకృతి, కండలు తిరిగిన దేహం కోసం యువత ఎంతలా పరితపిస్తూ జిమ్‌లో కష్టపడుతుంటారో చూస్తుంటాం. కొందరు స్టెరాయిడ్ల వంటి షార్టకట్‌లను ఆశ్రయిస్తుంటారు. అలా ఉంటేనే తమకు క్రేజ్‌, స్టార్‌డమ్‌ అన్నట్లుగా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ కండలతిరిగి దేహంతో ఉండటం అనేది అత్యంత అరుదు. పైగా అంత పోషకాహారంతో కూడిన భోజనం తినే అవకాశం, వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ కార్మికుడిని చూస్తే మన ఆలోచన తీరు మారుతుంది. తనకున్న వనరుల రీత్యా..తన బాడీని ఎలా ఫిట్‌గా ఉంచాలో కేర్‌ తీసుకుంటూ కండలు తిరిగిన దేహంతో అబ్బురపరుస్తున్నాడు. అతడి అనుసరిస్తున్న డైటింగ్‌ విధానం, వర్కౌట్లు గురించి తెలిస్తే విస్తుపోతారు. అన్నింట్లకంటే ఆశ్చర్యకరమైనది అతడు జిమ్‌కే వెళ్లడట. అలాంటప్పడు అతడికి ఇంతలా కండలు పెంచడం ఎలా సాధ్యమైంది అంటే ..

కంటెంట్‌ క్రియేటర్‌ జయచంద్రన్‌ తమిళరసన్‌ ఇటీవల ఓ చెన్నై కార్మికుడి శరీర సౌష్టవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో రూపంలో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో భవన నిర్మాణ పనులు చేసే అతడికి ఇలాంటి దేహం ఎలా సాధ్యమైందని కుతూహలంతో అడుగడం సష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన శరీరాకృతికి సహాయపడిని వ్యాయామ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి కూడా ప్రశ్నిస్తాడు కంటెంట్‌ క్రియేటర్‌ జయచంద్రన్‌. తాను నిర్మాణ కార్మికుడుగా మండుటెండలో తీవ్రమైన శ్రమతో కూడిన పనలు చేస్తుంటానని తెలిపాడు. 

తనకు రోజు కఠినమైన దినచర్య, ఎక్కువ పనిగంటలు ఉన్నప్పటికీ..వారానికి కనీసం ఐదుసార్లు వ్యాయామం చేసేలా చూసుకుంటానని చెప్పాడు. సోమవారం ఛాతీ వ్యాయామం, మంగళవారం భుజాల వ్యాయామం, బుధవారం వీపు వ్యాయామం, గురువారం బైసెప్స్‌, ట్రైసెప్స్‌ కోసం కేటాయిస్తుంటానని అన్నారు. శుక్రవారం కాళ్ల వ్యాయామం చేస్తుంటానని చెప్పారు. 

అతడు చేసేది శ్రమతో కూడిన పని కాబట్టి తీవ్రమైన కాళ్ల వ్యాయమాలు చేయనని అన్నారు. తన పనిలో కష్టపడ్డాక తన బాడీ కోసం ఎలా కేర్‌ తీసుకువాలో అలాగే దాన్ని ఎలా అమలు చేయాలో అనే దానిపై అతనికి ఉన్న స్పష్టత స్ఫూర్తిని కలిగిస్తోంది. 

డైటింగ్‌..
కండలు తిరిగిన దేహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం సాధారణంగా ప్రతికూల ఫలితాలనిస్తుందని భావిస్తారు. అందుకే వాళ్లంతా తరుచుగా ప్రోటీన్‌ అధికంగా ఉండే భోజనాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఈ నిర్మాణ కార్మికుడు అందుకు భిన్నంగా ఎంచుకోవడం విశేషం. అతడికి వృత్తిపరంగా అధిక కార్బోహైడ్రేట్లు అవసరం. అందుకే రోజుకు మూడుసార్లు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాన్ని ఎంచుకుంటాడు. అందులో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. 

పండ్లు తినడం కూడా అరుదని చెప్పాడు. అయితే వారానికి ఒకసారి మాంసాహారం తింటానని చెప్పాడు. తాను చికెన్‌ లేదా చేపలు మాత్రం తీసుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కండలు కోసం ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. అలాగే ఎలాంటి వాణిజ్య డైట్‌ప్లాన్‌లు లేదా వే ప్రోటీన్‌లు గానీ తీసుకోనని, కేవలం శుభ్రమైన ఆహారమే తీసుకుంటానని అన్నారు. ప్రతిరాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకుంటానని చెప్పారు. 

తాను ఇంట్లో వండిన ఆహారమే తింటానని అన్నాడు. చివరగా అందర్నీ జండ్‌ ఫుడ్‌ తినొద్దని, మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండమని సూచించాడు. ఆ కార్మికుడు నిబద్ధత ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, పైగా అతడిని చూస్తే..ఏ పనైనా నూటికి నూరు శాతం కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఉండదు అని చెబుతోంది కదూ అంటూ వీడియోని ముగిస్తాడు కంటెంట్‌ క్రియేటర్‌ జయచంద్రన్‌ ..!.

 

(చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)