మిద్దెతోటలో.. రసాయన అవశేషాలు లేని దానిమ్మ పండ్లు..

Published on Fri, 07/31/2026 - 07:49

క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న తల్లికి రసాయన అవశేషాలు లేని దానిమ్మ పండ్లు అందించాలనే ఒక కొడుకు తపన, నేడు నగర వ్యవసాయంలో ఆదర్శవంతమైన సాగు విప్లవానికి నాంది పలికింది. బంగ్లాదేశ్‌లోని తంగైల్‌ జిల్లా బాసాయిల్‌కు చెందిన 28 ఏళ్ల అల్‌ అమీన్‌ అనే మిద్దెతోట సాగుదారు విజయగాధ గాథ ఇది.

అమ్మ ఆరోగ్యం కోసం..
2023లో అల్‌ అమీన్‌ తల్లి లవ్లీ బేగం క్యాన్సర్‌ బారిన పడినప్పుడు, వైద్యులు ఆమెకు ప్రతిరోజూ దానిమ్మ పండ్లు తినిపించాలని సూచించారు. అయితే, మార్కెట్‌లో లభించే విదేశీ పండ్లు ఒక్కొక్కటి 500 నుంచి 600 (ఒక టకకు మన కరెన్సీలో 78 పైసలు) టకాల వరకు ఉండటమే కాకుండా, వాటి సాగులో వాడే రసాయనాల భయం వెంటాడింది. దీంతో అమీన్‌ తన గార్మెంట్‌ ఉద్యోగాన్ని వదిలేసి, తమ డాబాపైనే స్వచ్ఛమైన దానిమ్మ మొక్కలను పెంచటంప్రారంభించాడు. యూట్యూబ్‌ వీడియోల ద్వారా మెలకువలు నేర్చుకొని, గాజీపూర్‌ నుంచి మొక్కలు తెచ్చి నాటాడు. దురదృష్టవశాత్తు 2025 మే నెలలో అతని తల్లి కన్నుమూసినప్పటికీ, ఆమె స్మృత్యర్థం మిద్దెతోట సాగును కొనసా గించటమే కాదు మరింత విస్తరించాడు.

26 దేశవాళీ, విదేశీ రకాలు
అల్‌ అమీన్‌ తన ఇంటిపైన 70కి పైగా పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో దానిమ్మ చెట్లను సాగు చేస్తున్నాడు. ఆయన వద్ద ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 26 రకాల దానిమ్మ జాతులు ఉన్నాయి. వీటిలో భారతీయ రకాలైన ‘సూపర్‌ భగవా’, ‘మృదుల’, ‘గుజరాతీ’తో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన ‘థాయ్‌ దానిమ్మ’, ఆస్ట్రేలియాకు చెందిన ‘బిగ్‌ థాయ్‌’, మెక్సికన్, పాకిస్తానీ, రూబిన్‌ రకాలు ముఖ్యమైనవి. ప్రతి చెట్టు ఏడాదికి వర్షాకాలం, శీతాకాలంలో రెండుసార్లు దిగుబడినిస్తూ, చెట్టుకు 20 నుంచి 25 నాణ్యమైన పండ్లను ఇస్తోంది.

యువతకు స్ఫూర్తి
అల్‌ అమీన్‌ విజయం స్థానిక రైతులను, నిరుద్యోగ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో దానిమ్మ సాగులో విఫలమైన స్థానిక రైతు మిజానుర్‌ రెహమాన్, కళాశాల విద్యార్థిని తాంజియా అక్తర్‌ వంటివారు అల్‌ అమీన్‌ మార్గదర్శకత్వంలో డాబా తోటలనుప్రారంభించేందుకు ముందుకు వస్తున్నారు.

స్థానిక వ్యవసాయ సహాయక అధికారి ముహమ్మద్‌ అబు ఇలియాస్‌ తాలుక్దార్‌ మాట్లాడుతూ ‘అల్‌ అమీన్‌ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ యువతకు ఉపాధి మార్గం చూపించాడు. వ్యవసాయ విస్తరణ శాఖ ద్వారా ఆయనకు నిరంతరం సాంకేతిక ఉచిత సలహాలు, సహకారం అందిస్తున్నాం’ అన్నారు. తల్లిపై ఉన్న ప్రేమతో రూపుదిద్దుకున్న ఈ చిన్న ప్రయత్నం, నేడు లాభసాటి వ్యాపారంగా మారి బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా ‘రూఫ్‌టాప్‌ ఫార్మింగ్‌’కు కొత్త దిశను చూపిస్తోంది.

భారీ రాబడి
కేవలం పండ్ల విక్రయమే కాకుండా, అంటుకట్టిన దానిమ్మ మొక్లలను ఉత్పత్తి చేయటం ద్వారా అమీన్‌ వ్యాపారాన్ని విస్తరించాడు. మొక్క పరిమాణం, రకాన్ని బట్టి ఒక్కో మొక్కను 200 నుంచి 2,000 టకాల వరకు విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం తన మేడపైన, దగ్గర్లోని ఒక భూమిలో 1,500 నుంచి 2,000 అంటు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశాడు. దానిమ్మతో పాటు ద్రాక్ష, నారంజ మొక్కలు కూడా అమ్ముతున్నాడు. తన ‘ఫేస్‌బుక్‌’ పేజీ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్డర్లు పొం​దుతున్నాడు. స్వయంగా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మిద్దెతోటల ఏర్పాటుపైప్రాక్టికల్‌ సూచనలు ఇస్తున్నాడు. ఖర్చులు ΄ోను ఏడాదికి దాదాపు 10 లక్షల టకాలు (రూ. 7.8 లక్షలు) నికర లాభం ఆర్జిస్తున్నాడు.
– సాక్షి, సాగుబడి డెస్క్‌

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)