Breaking News

తరచూ ఫోన్ చూస్తున్నారా?.. డేంజర్‌లో పడినట్లే!

Published on Tue, 02/24/2026 - 09:18

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. శ్వాస తీసుకోవడం, కనురెప్ప వేయడం ఎంత సహజంగా జరుగుతుంటాయో, అదే మాదిరిగా తెలియకుండానే ఫోన్ స్క్రీన్‌ను చూడటం  అనేది అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు మన మెదడు పనితీరును, ముఖ్యంగా ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ, దక్షిణ కొరియాలోని కైమ్యుంగ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఫోను చూడటంపై నిర్వహించిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలను వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి రోజుకు సగటున 110 సార్లు ఫోన్ చెక్ చేస్తున్నారంటే,  అతను తీవ్రమైన ఫోన్ వ్యసనంలో ఉన్నారని అర్థం. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, మన మేధో సామర్థ్యాలను క్రమంగా కుంగదీసే ఒక మానసిక సమస్యగా మారుతోందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మెదడుపై ‘డిజిటల్’ దాడి
మనం పదేపదే ఫోన్ చూడటం వల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని బెంగళూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. గిరిప్రసాద్ తెలిపారు. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ వైపు చూస్తే మెదడు ఆ పనిని పక్కన పెడుతుంది. తిరిగి పని మొదలుపెట్టినప్పుడు మెదడు మళ్లీ మొదటి నుండి శ్రమించాల్సి వస్తుంది. ఈ ‘స్విచ్చింగ్’ ప్రక్రియ వల్ల మెదడు త్వరగా అలసిపోయి, క్రమంగా ఏకాగ్రతను కోల్పోతుంది.

నోటిఫికేషన్ రాకపోయినా ..
మనం ఎంత సమయం ఫోన్ వాడుతున్నామనే దానికంటే, ఎన్నిసార్లు పని మధ్యలో ఫోన్‌ను చూస్తున్నామనేదే ముఖ్యం. ఫోన్  కల్పించే ఈ ‘అంతరాయం’ వల్లే ఏకాగ్రతకు అధిక నష్టం జరుగుతుంది. ఏదైనా నోటిఫికేషన్ రాకపోయినా సరే, ఊరికే ఫోన్ అన్‌లాక్ చేసి చూడటం ఒక బలహీనతగా మారుతుంది. దీనివల్ల మెదడు ఎక్కువ సేపు ఒకే విషయంపై దృష్టి పెట్టలేక ‘షార్ట్ అటెన్షన్ స్పాన్’కు అలవాటు పడిపోతుంది.

పరిమితి ఎంతంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 50 నుంచి 80 సార్లు ఫోన్ చెక్ చేయడం ఒక సాధారణ పరిమితిగా పరిగణించవచ్చు. కానీ ఈ సంఖ్య 100 మార్కును దాటితే మాత్రం మీరు ప్రమాదకరమైన జోన్‌లో ఉన్నారని గ్రహించాలి. ఎటువంటి అవసరం లేకుండానే ఫోన్ తీయడం అనేది అదుపులేని అలవాటుగా మారి, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

మెదడును తిరిగి గాడిలో పెట్టండిలా..
ఈ వ్యసనం నుండి బయటపడటం అసాధ్యమేమీ కాదు. అనవసరమైన నోటిఫికేషన్లను వెంటనే ఆపివేయండి. చదువుకునేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఫోన్‌ను కంటికి దూరంగా ఉంచండి. ప్రతి 3 లేదా 6 గంటలకు ఒకసారి మాత్రమే ఫోన్ చూసుకునేలా నియమించుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు కనీసం 20 నుండి 50 నిమిషాల పాటు ఫోన్ ముట్టుకోకుండా ఆ పనిపైనే దృష్టి సారించడం ద్వారా మెదడును తిరిగి ఉత్తేజితం చేయవచ్చు.

‘డిజిటల్ డిటాక్స్’ కోసం..
మెదడు చురుగ్గా పనిచేయాలంటే రాత్రి వేళల్లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దానికి బదులుగా పుస్తక పఠనం, ధ్యానం వంటి అలవాట్లను అలవరచుకోవాలి. సరైన నిద్ర మెదడుకు రీఛార్జ్‌లా పనిచేస్తుంది. మీరు మీ ఫోన్‌ను నియంత్రిస్తున్నారా లేక ఫోన్ మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఒక్కసారి ఆలోచించుకోండి.

ఇది  కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)