Breaking News

పిగ్మెంటేషన్‌ లేదా మంగు మచ్చలు.. ఇంట్లోనే ఇలా తగ్గించుకోవచ్చు!

Published on Mon, 03/18/2024 - 12:09

వేసవికాలంలో ప్రధానంగా వేధించే  సమస్య ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి.  ఈ మచ్చలను మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్‌ అంటారు. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా   అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్‌ చికిత్సలు, మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. 

అసలు  మంగు మచ్చలు ఎందుకు వస్తాయి?
వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. అయితే వీటిని శారీరకమైన బాధలేవీ ఉండవు. శరీరంలో మెలనిన్ ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది. 

సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేసి, ఆ సమయంలో మెలనిన్ ఎక్కువై మంగు మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం,అనుధార్మికత, ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి.

బంగాళ దుంప:  బంగాళ దుంపల తురుమును పలచని గుడ్డలో వేసి రసం తీసుకోవాలి.  ఒక  కాటన్‌ ప్యాడ్‌ను గానీ, దూదిని గానీ ఈ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి.

టమోటా: గింజలు తొలగించిన టమోటా గుజ్జుకు, కొద్దిగా  తేనె కలిపి మచ్చలకు అప్లయ్‌ చేయాలి. 20 నిమిషాలు ఉంచి ఆరిన  తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది. 

టమోటా, ముల్తానా మట్టి: టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండుస్లారు ఇలా చేస్తే మంచు మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి.

కలబంద: సహజసిద్ధమైన కలబంద గుజ్జు చాలా రకాల చర్మ సమస్యలకు పరిష్కారం. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున  రాస్తే మంగు మచ్చలు మాటుమాయం.

నిమ్మ, రోజ్‌వాటర్‌: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి.  దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.  రోజ్ వాటర్  లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. 

పసుపు: పసుపు, గేదె పాలు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి.  తాజా గేదె నెయ్యి  మంగు మచ్చలపై రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)