Breaking News

ఈ ఒక్క నామంతో విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం

Published on Sat, 08/09/2025 - 10:23

కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామ సంకీర్తన అని అందరికీ తెలుసు. అయితే పాడటం తెలీదని చింతించనక్కర్లేదు. భజనలు ఎలా చేయాలో కూడా తెలీదు అని చింతించ నక్కర్లేదు. సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా ఉచ్చరించలేనుగా అని చింతించనక్కర్లేదు. నిజాయతీగా, భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’ – దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన ప్రయోజనం పొందుతాం అంటారు. అది కూడా సాధ్యం కాదా? ఐదు నామాలు చాలు. అయిదింటిలో మొదటి నామం: ‘రామ’. చింతలు, దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని రామ నామాన్ని జపిస్తే చాలు, రామ నామం విన్న వెంటనే హను మంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అంటారు. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్‌/ తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్‌’.

రెండవ నామం: ‘కృష్ణ’. ఈ నామమే పాండవులను రక్షించింది. ‘కృష్ణా! నాకు కష్టాలు ఇవ్వు! అప్పుడే, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని కృష్ణుడిని వరం అడిగింది కుంతి. మానసిక బలాన్నీ, కష్టాలను భరించే ఓర్పునూ ఇచ్చే నామమిది. మూడవ నామం: ‘నారాయణ’. బాలుడు ప్రహ్లాదుడిని రక్షించిన నామం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామం. నాలుగవ నామం: ‘గోవింద’. దుశ్శాసన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి ‘గోవింద! గోవింద!’ అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామమిది. తిరుమలలో ఎల్లవేళలా ప్రతిధ్వనించే నామం. ఇక ఐదవ నామం: ‘నరసింహ’. నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు. వేరు వేరు పేర్లతో ఉన్న దేవుని ఏ పేరుతో ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడు.
– యామిజాల జగదీశ్‌

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)