కొన్ని సందర్భాల్లో.. మౌనమే సమాధానం!

Published on Sat, 06/13/2026 - 10:27

మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!

మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్‌లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..

ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు..
ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్‌కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.

ముందే పరిష్కారం దొరికినప్పుడు..
మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్‌గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్‌ చేయండి. కానీ, 
అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.

విషయం తెలియనప్పుడు..
మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.

రుజువు చేసుకోలేనప్పుడు...
మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.

అవతలివారిని బాధపెట్టే సందర్భంలో...
మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.

మనసు బాగోలేనప్పుడు...
అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)