Breaking News

సిగకారుడు.. సావియో జాన్‌ పరేరా

Published on Sun, 10/27/2024 - 09:55

సావియో జాన్‌ పరేరా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెయిర్‌ స్టయిలిస్ట్‌. బాలీవుడ్‌ స్టార్స్, స్పోర్ట్స్‌ లెజెండ్స్‌ జుట్టు ఆయన చేతుల్లోనే ఉంటుంది. సినిమా ప్రమోషన్, అవార్డ్‌ ఫంక్షన్, రెడ్‌ కార్పెట్‌ వాక్‌.. ఏ ఈవెంట్‌కైనా.. సావియో వచ్చి సెలబ్రిటీల కొప్పు ముడిస్తేనే వాళ్లు గడప దాటేది! అంతెందుకు ఇంగ్లిష్‌ యాక్ట్రెస్‌ లిజ్‌ హార్లీ.. తన పెళ్లిలో కేశాలంకరణకు ఏరికోరి మరీ సావియో జాన్‌నే అపాయింట్‌ చేసుకుంది! అదీ ఈ ముంబై వాసి రెప్యుటేషన్‌!!

హెయిర్‌ డ్రెసింగ్‌లో సావియోది దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హెయిర్‌ డ్రెసర్స్, హెయిర్‌ స్టయిలిస్ట్‌లు అందరి దగ్గరా శిక్షణ పొంది వచ్చాడు. నైపుణ్యం సాధించాడు. హెయిర్‌ సెలూన్స్‌ పెట్టాడు. ఫ్యాషన్‌ షోస్‌కి, అడ్వర్టయిజ్‌మెంట్‌ క్యాంపెయిన్స్‌కి, ఎల్, వోగ్, హార్పర్స్‌ బజార్, కాస్మోపాలిటన్‌ లాంటి మేగజీన్స్‌ ఫొటో షూట్స్‌కి పనిచేశాడు. బాంబే టైమ్స్, హిందుస్తాన్‌ టైమ్స్, మిడ్‌–డే, ముంబై మిర్రర్, సినీ బ్లిట్జ్‌ వంటి పత్రికలకు కాలమ్స్‌ రాస్తుంటాడు. జూమ్, ఎన్‌డీటీవీ గుడ్‌ టైమ్స్‌ వంటి చానల్స్‌కీ పానలిస్ట్‌గా ఉన్నాడు. 

ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లకు జడ్జిగా వ్యవహరించాడు. ఎన్నో బాలీవుడ్‌ చిత్రాలకు హెయిర్‌ డ్రెసర్‌గా పనిచేశాడు. ప్రియంకా చోప్రా, ప్రీతి జింటా, కంగనా రనౌత్, సోనాక్షీ సిన్హా, శిల్పా శెట్టీ, నేహా ధూపియా, అదితీరావ్‌ హైదరీ, డింపుల్‌ కపాడియా, మేరీ కోమ్, ఇంతియాజ్‌ అలీ, యువరాజ్‌ సింగ్‌ లాంటి సెలబ్రిటీలకు పర్సనల్‌ హెయిర్‌ డ్రెసర్‌గా ఉన్నాడు. హెయిర్‌ డ్రెసింగ్‌లో మెలకువలు సంపాదించుకోవాలనుకునేవాళ్ల కోసం ‘సావియో జాన్‌ పరేరా.. ది అకాడమీ’నీ నెలకొల్పాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాడు.

‘నాకు పనే దైవం. అందులో నిత్యం ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్స్‌ కాన్ఫిడెన్స్‌ను పెంచే స్టయిల్స్‌ని క్రియేట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటా. స్టయిల్‌ అనేది వ్యక్తిగతం. పరిశీలన, మెలకువలతో ఎవరికివారే తమదైన సిగ్నేచర్‌ స్టయిల్‌ని క్రియేట్‌ చేసుకోవాలి. అలాంటి సృజనకు ఆకాశం కూడా హద్దు కాదు. స్టయిల్‌ అనేది ఒక ఐడెంటిటీ. అది వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తుంది’ అంటాడు 
సావియో జాన్‌ పరేరా.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)