ఉత్సాహంగా బరాత్‌, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం

Published on Tue, 10/28/2025 - 17:21

ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక  ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది.

ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన  పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్‌లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం  చేసుకున్నాయి.  

వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్‌) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే  స్పందించిన  బంధువులు ఆసుపత్రికి తరలించగా,  అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది.  దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు  గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్‌ రాత్రి పూజకు గుండెపోటు  రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు  వాపోయారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)