Breaking News

హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్‌ యాక్షన్‌!

Published on Thu, 10/09/2025 - 16:14

ప్రయాణాల్లో అనేక వింత ఘటనలు చూస్తూ ఉంటాం. కొంతమంది తప్పు తమది అయినా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. టికెట్‌ లేకుండా ప్రయాణించడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

బిహార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణిస్తోంది. అదీ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తు న్నప్పుడు తనిఖీ అధికారి టీటికి ట్టుబడింది. అయితే  తప్పు ఒప్పుకొని జరిమానా చెల్లించాల్సింది పోయి, ఎదురు దాడికి దిగింది. తాను ప్రభుత్వ టీచర్‌ననీ, ఇబ్బంది పెడుతున్నావు...   కావాలనే, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నావు అంటూ అతనిపై మండిపడింది. 

దానికి "ఇది ఇబ్బంది పెట్టడం కాదు. మీ దగ్గర టిక్కెట్‌లేదు, గతంలో కూడా ఇలానే టికెట్ లేకుండా ప్రయాణించారని సమాధానం చెప్పాడు టీటీ. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అబద్ధం చెబుతున్నావంటూ ఆయన మీద ఎగిరిపడింది. దీంతో ఈ తతంగాన్నంతా తన మొబైల్‌లో వీడియో తీయడం మొదలు పెట్టడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో రికార్డింగ్ ఆపేయాలంటూ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. తన విధులకు ఆటంకం కలగించొద్దు అంటూ ఆయన మళ్లీ మందలించాడు. దీంతో నన్ను వేధిస్తున్నారు అంటూ చివరి అస్త్రం ప్రయోగించింది. ఆతరువాత అక్కడినుంచి మెల్లగా జారుకుంంటూ నువ్వు  వేస్ట్‌ ఫెలోవి అంటూ  నోరు పారేసుకుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది. 

ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది, చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళ "విక్టిమ్‌ కార్డు" వాడిందని విమర్శించారు. ప్రభుత్వ టీచర్‌ అయి ఉండా కూడా టికెట్ లేకుండా ప్రయాణించడం, ముఖ్యంగా తన పని తాను చేసుకుంటున్న టికెట్ ఎగ్జామినర్‌పై మండిపడటం సరికాదని కొందరు  విమర్శించారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)