Breaking News

క్యూట్‌ క్యాట్‌..ఒత్తిడి సెట్‌..!

Published on Wed, 10/01/2025 - 09:28

ఫిజియోథెరపీ.. లాఫింగ్‌ థెరపీ.. ఫిష్‌ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్‌ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్‌ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్‌ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. 

క్యాట్‌ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్‌ పార్ట్‌నర్స్‌ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్‌ థెరపీలు సైతం హాయ్‌ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. 

హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్‌ థెరపీ పేరుతో ప్యాసింజర్స్‌ లాంజ్‌లో క్యూట్‌ క్యూట్‌ పప్పీస్‌ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్‌ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్‌ కంట్రీ నిర్వాహకులు. 

మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్‌ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్‌ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్‌ హైదరాబాద్‌లో ఆవిష్కృతం కావడం విశేషం. 

క్యాట్స్‌ కంట్రీ.. దేశంలో ప్రథమం.. 
ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్‌ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్‌షాహీ 7 టూమ్స్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్‌ క్యాట్స్‌ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. 

కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.  

50 రకాలకుపైగా పిల్లులు.. 
ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్‌ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్‌ థెరపీ అంటారు. 

ఇవన్నీ వ్యాక్సినేషన్‌ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్‌లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా.. స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్‌ బుక్‌ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. 

వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. 
స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 

35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్‌సైట్‌ www. CatsCountry. in  లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. 
– ముహమ్మద్‌ యాకుబ్‌ షరీఫ్, క్యాట్స్‌ కంట్రీ వ్యవస్థాపకులు 

(చదవండి: ఇదేం పేరెంటింగ్‌..! వామ్మో ఈ రేంజ్‌లో డేరింగ్‌ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు)

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)