Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్‌!

Published on Thu, 05/15/2025 - 17:16

ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ సిటీ   ప్యారిస్‌లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్‌ రంగ నిపుణులతో ఇక్కడ సందడి నెలకొంది. అయితే  భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి  చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ ఊహించని దెబ్బ   తగిలింది.    

ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫెస్టివ్‌లో తన తొలి అనుభవం కోసం ఎదురు చూస్తున్న సాక్షి, తన  లగేజీని పోగొట్టుకుంది. ఆమెకు  సంబంధించిన నాలుగు బిజినెస్‌ క్లాస్‌ బ్యాక్‌లు మాయమై పోయాయి. దీంతో సాక్షి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగలాల్సిన కేన్స్‌   అనుభవం   సంక్షోభంలో పడిపోయింది.  ఈ విషయాన్ని సాక్షి ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. దయచేసి సాయం చేయండి అంటూ మొర పెట్టుకుంది. అలాగే ఈ సమస్యపై స్పందించని, సహకరించకపోవడం పట్ల లుఫ్తాన్స , స్విస్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె ఫ్యాన్స్‌ సాక్షికి సానుభూతి ప్రకటించారు .

ఇదీ చదవండి: తీవ్ర నష్టాల్లోలగ్జరీ ఫ్యాషన్‌ హౌస్‌, 1700 మందికి ఉ‍ద్వాసన​

'స్టైల్‌మీఅప్ విత్ సాక్షి' అనే హ్యాండిల్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. నైస్ విమానాశ్రయం మీదుగా కేన్స్‌కు వెళ్లేటప్పుడు లుఫ్తాన్స మరియు స్విస్ ఎయిర్‌లైన్స్ ఆమె చెక్-ఇన్ బ్యాగులను ఒక్కొక్కటి పోగొట్టుకున్నాయని సాక్షి వెల్లడించింది. ఆమె ఇలా రాసింది.

"నమ్మశక్యం కాని  భయంకరమైన సంఘటన జరిగింది. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను నా 4 బ్యాగులూ పోగొట్టుకున్నాను.  ఇపుడు నా దగ్గర ఏ వస్తువులూ లేకుండా నేను కేన్స్‌లో ఉన్నాను. నా జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి ఈ మొత్తం  ఉదంతంలో లుఫ్తాన్సా , స్విస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’’ అని  ఆమె  పేర్కొంది.

కేన్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన కోసం నెలల తరబడి వేచి ఉన్నాననీ, తన లగేజీ సురక్షితంగా ఉండాలని,  “హై ప్రియారిటీ”  కింద బిజినెస్ క్లాస్‌లో చెక్ ఇన్ చేశానని తెలిపింది.విమానయాన అధికారుల నుండి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: కోవిడ్‌ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలు

ఎవరీ సాక్షి సింధ్వానీ
ఢిల్లీకి చెందిన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్  ప్లస్‌ సైజ్‌ ఫ్యాషన్ కంటెంట్‌కు పేరుగాంచింది, అంతర్జాతీయ అందాల దిగ్గజం లోరియల్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తూ, కేన్స్ 2025 లో చరిత్ర సృష్టించనున్న భారతీయ ప్రభావశీలురులలో సాక్షి సింద్వానీ ఒకరు.  ధైర్యంగా ఫ్యాషన్ స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టి   ప్లస్-సైజు ఇన్ఫ్లుయెన్సర్‌గా తకంటూ ఒక పేరు తెచ్చుకుంది.
 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)