Breaking News

Nancy Tyagi ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్‌ చేస్తే కేన్స్‌లో అదరగొట్టేసింది!

Published on Thu, 05/30/2024 - 10:09

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై  అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్  నాన్సీ త్యాగి  కేన్స్‌ 2024లో ఎలా చేరింది.  ఉత్తరప్రదేశ్‌లోని  బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్  దాకా ప్రయాణం  ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.

ఇంటర్‌ మంచి మార్కులతో  పాసైన తరువాత 2020 ఐఏఎస్‌ అవ్వాలనే  ఆశయంతో  ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్‌ మహమ్మారి, లాక్‌డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు  గడపడం కష్టంగా మారింది.  ఇక  సివిల్స్‌  కోచింగ్‌కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్‌పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన  ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్‌కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం  మొదలు పెట్టింది. 

కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ నడుపుకునే  తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్‌ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్‌లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది.  ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్‌ అయింది.

కేన్స్‌లో యువ డిజైనర్‌గా మెరిసింది. స్టన్నింగ్‌ లుక్స్‌,  డిజైనర్‌ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు.  ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.

మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర  తదితర లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత.  

కేన్స్  కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్‌ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది.  ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్‌తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్‌తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా  వీపరీతంగా నచ్చేసింది.

ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్,  సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా  వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్‌ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా. 

ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన  అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన  ఫ్యాషన్‌తో మరింత  అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)