Breaking News

ట్రక్కునే మొబైల్‌ హౌస్‌గా మార్చిన మహిళ!

Published on Tue, 02/06/2024 - 17:03

కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్‌ హౌస్‌గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది.

వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్‌ నార్త్‌ వెస్ట్‌లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది.

ఈ మొబైల్‌ క్యాబిన్‌ బ్రిటీష్‌ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్‌తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్‌(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్‌రూమ్‌, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి.

(చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)