Breaking News

పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!

Published on Mon, 06/22/2026 - 07:54

తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు సందడిగా మారాయి. యూనిఫాంలు, షూస్‌, బ్యాగులతో చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు. అయితే స్కూల్‌ యూనిఫాంలో భాగమైన ఒక అంశం గురించి వైద్య నిపుణులు హెచ్చరికలను ఓసారి చర్చిద్దాం. చాలామంది తల్లిదండ్రులు సాధారణంగా భావించే ఈ విషయం.. పిల్లల సౌకర్యం, ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. 

స్కూల్‌ యూనిఫాంలో టై అనేది తప్పనిసరి. పిల్లలు చక్కగా కనిపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు టైలను సరిగ్గా కట్టి పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఊడిపోకూడదని భావిస్తుంటారు. అయితే టైని అతిగా బిగించడం వల్ల పిల్లలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మెడకు బిగిగా టై ధరించడం వల్ల.. మెదడుకు వెళ్లే రక్తప్రసరణపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. జర్మనీకి చెందిన పరిశోధకులు.. నిర్వహించిన అధ్యయనంలో బిగుతుగా కట్టిన టై మెదడుకు వెళ్లే రక్తప్రసరణను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని గుర్తించారు. 

పిల్లల డాక్టర్లు చెబుతోంది ఏంటంటే..  పిల్లలు రోజులో చాలా గంటల పాటు తరగతి గదుల్లో కూర్చుంటారు. అలాంటి సమయంలో మెడపై అనవసర ఒత్తిడి పడితే తలనొప్పి, తలతిరుగుడు, వికారం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. 

టై బిగుతుగా ఉందా? లేదా? అనేది కొందరు పిల్లలు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. కొందరు అసౌకర్యంగా ఉన్నా కూడా స్కూల్‌ నిబంధనల కారణంగా భరిస్తుంటారు. అందుకే ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపే ముందు టై మరీ గట్టిగా ఉందేమో ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు పరిశుభ్రత విషయంలో కూడా టైలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనిఫాంలను తరచూ ఉతికే తల్లిదండ్రులు టైలను మాత్రం చాలాసార్లు మర్చిపోతుంటారు. పిల్లలు టైలను చేతులతో తాకడం, కొన్నిసార్లు నోటికి దగ్గరగా తీసుకెళ్లడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే టైలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.

తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..

* టైని మెడకు అతిగా బిగించవద్దు.
* మెడకు, టైకి మధ్య ఒకటి లేదా రెండు వేళ్లు వెళ్లేంత ఖాళీ ఉండాలి.
* పిల్లలు అసౌకర్యంగా ఉందని చెబితే వెంటనే టైని వదులుగా చేయాలి.
* ఇంటికి వచ్చిన తర్వాత టైని తీసేయాలి.
* టైలను కూడా యూనిఫాంల మాదిరిగానే క్రమం తప్పకుండా ఉతకాలి.
* తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు తరచూ ఉంటే వైద్యులను సంప్రదించాలి.

అయితే పైన చెప్పిన అధ్యయనం నేరుగా చిన్నారులపై జరగకపోయినా.. పిల్లల విషయంలో కూడా అతిగా బిగించిన టైలు ఇబ్బందులకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. టై అనేది యూనిఫాంలో చిన్న భాగమే కావచ్చు. కానీ పిల్లల సౌకర్యం, ఆరోగ్యం విషయంలో ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. స్కూల్‌కు పంపే ముందు టై సరిగ్గా ఉందా, బిగుతుగా లేదో ఒకసారి చూసుకోవడం ద్వారా అనవసరమైన అసౌకర్యాన్ని నివారించవచ్చు. పిల్లలు చక్కగా కనిపించడం ఎంత ముఖ్యమో.. వారు రోజంతా సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)