Breaking News

బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?

Published on Wed, 08/26/2026 - 09:06

కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి తన స్వార్జిత ఆస్తులతో పాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా నాకు రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా బహూకరించారు. అనంతరం మా తల్లి మరణించడంతో మా తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. తన రెండోభార్య ప్రభావంతో ఇటీవల ఆ గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. తండ్రికి ఇష్టమొచ్చినప్పుడు ఇలాంటి రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసే అధికారం ఉంటుంది అని అంటున్నారు. ఆయన అలాంటి చర్య తీసుకోకుండా కోర్టు ద్వారా రక్షణ పొందగలనా?
– విశ్వసాగర్, మహబూబ్‌ నగర్‌

చట్టపరంగా ఒకసారి చెల్లుబాటయ్యే విధంగా బహుమతి పూర్తయి, దానిని స్వీకరించిన అనంతరం, కేవలం దాత మనసు మార్చుకున్నందుకు లేదా కుటుంబ పరిస్థితులు మారాయనే కారణంతో ఆ బహుమతిని ఏకపక్షంగా రద్దు చేయడం అంత సులువేం కాదు.ట్రాన్స్ఫర్ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్‌ 122 ప్రకారం, బహుమతి అంటే ప్రతిఫలం లేకుండా స్వచ్ఛందంగా ఆస్తిని బదిలీ చేయడం; అదే చట్టంలోని సెక్షన్‌ 126 ప్రకారం గిఫ్ట్‌ను రద్దు చేసే అవకాశం చాలా పరిమితమైన సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, గిఫ్ట్‌ డీడ్‌లోనే దాత ఇష్టానుసారం కాకుండా, ఒక నిర్దిష్ట సంఘటన సంభవించినప్పుడు బహుమతి రద్దు కావచ్చని చట్టబద్ధంగా అంగీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ‘‘నాకు నచ్చినప్పుడు గిఫ్ట్‌ను రద్దు చేసుకుంటాను’’ అంటే కుదరదు. అలా రాసుకున్నా చట్టం ఒప్పుకోదు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే సూత్రాన్ని పునరుద్ఘాటించాయి.

మీ తండ్రిగారు ఏం చేస్తారో చెప్పలేదు. ఆయనకు ఆస్తులు ఉన్నాయా? ఉద్యోగస్తుడా? ఎందుకంటే, ఒకవేళ గిఫ్ట్‌ డీడ్‌లో తండ్రిని జీవితాంతం పోషించాలి, నివాసం కల్పించాలి లేదా ఇతర  థమిక అవసరాలు తీర్చాలి అనే షరతు స్పష్టంగా ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. 

తండ్రి సీనియర్‌ సిటిజెన్‌ అయితే, మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్పేర్‌ ఆఫ్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ అండ్‌ పేరెంట్స్‌ యాక్ట్, 2007లోని కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఆస్తి బదిలీని రద్దు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బదిలీ గ్రహీత తల్లిదండ్రికి ప్రాథమిక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చాలనే షరతు ఉన్నప్పుడు, ఆ బాధ్యతను నిర్వర్తించనప్పుడు ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి ఆయనకు వాస్తవంగా మెయింటెనెన్స్‌ అవసరమా లేదా, ఆయన ఆదాయం ఎంత, గిఫ్ట్‌ డీడ్‌లో ఏమైనా మెయింటెనెన్స్‌ ఉందా వంటి అంశాలను వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అలాగని కేవలం  మెయింటెనెన్స్‌ కోరే హక్కు ఉండటం వల్లనే ఇప్పటికే పూర్తయిన గిఫ్ట్‌ డీడ్‌ను స్వయంచాలకంగా రద్దు చేసే హక్కు దాతకు ఏర్పడదు. సెక్షన్‌ 126 లేదా సీనియర్‌ సిటిజెన్స్‌ యాక్ట్‌ లోని వర్తించే నిబంధనల కింద చట్టపరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే బహుమతి రద్దుచేసే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

అదలా ఉంటే కోర్టులో ఇంజక్షన్‌ సూట్‌ వేసే అవకాశం ఉన్నప్పటికీ మీ తండ్రిగారు బెదిరిస్తున్నారనే కారణంతో మీరు వెంటనే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ముందుగా గిఫ్ట్‌ డీడ్‌ను న్యాయపరంగా పరిశీలించి, అందులో రివోకన్స్, మెయింటెనెన్స్, లైఫ్‌ ఇంటరెస్ట్‌ లేదా ఇతర షరతులు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. బెదిరింపులకు భయపడటం కంటే ముందుగా గిఫ్ట్‌ డీడ్‌ పూర్తి కాపీని న్యాయ నిపుణుడితో పరిశీలించి, అవసరమైతే ముందస్తు న్యాయపరమైన రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. దగ్గరలోని మంచి లాయరు గారిని కలవండి. 

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం 
 sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)