Breaking News

రెడ్‌ వెల్వెట్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ తెగ లాగించేస్తున్నారా? అయితే కేన్సర్‌ ముప్పు

Published on Thu, 10/03/2024 - 13:40

పుట్టినరోజు, పెళ్లి రోజు,  నూతన  సంవత్సరం, ఇలా వేడుక ఏదైనా కేక్‌ ఉండాల్సిందే.  ఖరీదైనా సరే.. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్‌ ఉంటే  ఇక ఆ సందర్భానికి  మరింత జోష్‌.  వీటిని అంటే అంతలా ఇష్టపడతారు.  కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు కేన్సర్‌ కారకమవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ రెండు రకాలతోపాటు మరో 12 పాపులర్‌ కేక్స్‌ తయారీకి వాడే రంగులతో జాగ్రత్త అని హెచ్చరించింది. 

అందం, ఆకర్షణ కోసం వంటకాల్లో రంగులు వాడటం కొత్త కాదు కానీ.. వీటిల్లో కొన్ని మరీ ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసిన రంగులు కేన్సర్‌ను కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ విభాగం బెంగళూరులోని బేకరీల్లోని కేక్స్‌పై పరీక్షలు నిర్వహించింది. అల్లురా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సో 4ఆర్, టార్ట్రాజైన్ ,కార్మోయిసిన్ వంటి హానికరమైన కృత్రిమ రంగుల వీటి తయారీకి వాడుతున్నట్లు గుర్తించింది. ఇవన్నీ కేన్సర్ ముప్పును పెంచేవేనని స్పష్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకూ ఈ కృత్రిమ రంగులు కారణమవుతాయని తెలిపింది.

ఈ ఫలితాల దృష్ట్యా, కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ఆహార భద్రతా నిబంధనలను పాటించాలని, వినియోగ యోగ్యమైన పదార్థాలనే ఉత్పత్తుల తయారీలో ఉపయోగించాలని బేకరీలను కోరింది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది.    (శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం)

గోబీ మంచూరియా, కబాబ్‌లు, పానీ పూరీ లాంటి వాటిల్లోనూ కేన్సర్‌ కారక కృత్రిమ రంగులు వాడినట్లు కర్ణాటక ‍ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అంతేకాకుండా.. రోడమైన్‌-బి లాంటి రంగులపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి కృత్రిమ రంగుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)