Breaking News

ఏ తల్లి అయినా అమ్మే..! హ్యాట్సాప్‌ బ్రదర్‌

Published on Fri, 08/29/2025 - 16:22

భారతదేశంలో మహిళ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుత్తున్న తరుణంలో ఈ ఘటన భరోసాకు అర్థం ఏంటో చూపించింది. సోషల్‌ మీడియాలో చాలామంది మహిళలు పంచుకున్న చేదు అనుభవాలు రీత్యా ఇక్కడ క్యాబ్‌ రైడ్‌ అనేది అంత సేఫ్‌ కాదనే అభిప్రాయం సర్వత్రా బలంగా ఉంది. అలాంటి టైంలో ఈ డ్రైవర్‌ ప్రతిస్పందన ప్రతి ఒక్కర్ని కదిలించింది. నెటిజన్లు అతడిని హ్యాట్సాప్‌ భయ్యా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌  అవుతోంది. 

యాషికా రాపారియా అనే భారతీయ మహిళ ఒక రైడ్‌లో తాను ఎదుర్కొన్న అసాధారణ అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ అసాధారణ సంజ్ఞ తనను మంత్రముగ్గుల్ని చేసిందని అంటోందామె. ఇలాంటి మనుషులకు కూడా ఉన్నారా అని భావన కలిగిందని చెప్పుకొచ్చిందామె. ఇది పూణేలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆమె తన నెలల పసికందుతో కలిసి క్యాబ్‌లో ప్రయాణిస్తోంది. ఇంతలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది. 

అయితే ఇది భారతదేశం. ఇక్కడ పాలివ్వడం అనేది అసాధారణమైన పనిగా భావిస్తారని ఫీల్‌తో క్యాబ్‌లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడింది. ఆ నిమిత్తమై ముందు జాగ్రత్తగా ఒక దుప్పటి కూడా తెచ్చుకుంది. అది వేసుకని మరి పాలిస్తున్న ఏదో తెలియని భయంతో చాలా నెర్వస్‌గా ఫీలయ్యింది. అలానే భయపడుతూ ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెకు బీ సేవ్‌ అంటూ భరోసా ఇస్తున్నట్లుగా తన ముందున్న అద్దాన్ని ఎడ్జెస్ట్‌ చేశాడు. 

అస్సలు వెనుకసీటులో ఏం జరుగుతుందనేది అస్సలు ఆడ్రైవర్‌కి తెలియను కూడా తెలియదు. ఒక్కసారిగా ఆ బిడ్డ తల్లిని ఒక్క సంజ్ఞతో ఓ తల్లికి గౌరవం తోపాటు భద్రతకు అర్థం ఏంటో చేతల్లో చేసి చూపించాడు. అయినా అవతలివాళ్లకు భరోసా ఇవ్వాలంటే  మాటలతో పనిలేదని, చిన్న సర్దుబాటు చాలని చెప్పకనే చెప్పాడు. క్యాబ్‌ డ్రైవర్లపై ఉండే అభిప్రాయమే మార్చుకునేలా చేశాడు తన ప్రవర్తనతో. అంతేగాదు మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు కూడా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది ఆ తల్లి.

 

(చదవండి: గణేశ్‌ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. ! వీడియో వైరల్‌)

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)