Breaking News

పది కిలోలు బరువు తగ్గిన భారత్‌పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!

Published on Mon, 08/11/2025 - 15:46

భారతదేశపు అతిపెద్ద ఏకీకృత యూపీఐ క్యూర్‌ కోడ్‌ ప్రోవైడర్‌ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో అష్నీర్‌ గ్రోవర్‌(Ashneer Grover) స్లిమ్‌గా మారిపోయారు. ఆయన సోనీ టీవి వ్యాపార రియాలటీ టెలివిజన్‌ సీరీస్‌ షార్క్‌ ట్యాంక్‌ సీజన్‌ 1లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను మోటా వాలా షార్క్‌గా అని పిలుస్తున్నారు. బహుశా ఆ క్రేజ్‌ అతడిని ఫిట్‌నెస్‌పై దృష్టిసారించేలా చేసి పదికిలోలుమేర బరువు తగ్గేందుకు దారితీసింది. ఆయన ఈ కొత్త లుక్‌లో యంగ్‌ ఆష్నీర్‌గా ఆకర్షణీయంగా ఉన్నారు. అందుకు రెండే రెండు ప్రిన్స్‌పల్స్‌ హెల్ప్‌ అయ్యాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!.

'క్రమశిక్షణ', 'సంకల్పం' వంటి రెండు సూత్రాలను గట్టిగా అనుసరిస్తే భారమైన బరువుని సులభంగా వదిలించుకోగలమని చెబుతున్నారు అష్నీర్‌. ఇవి రెండు ఎప్పుడూ వినే సాధారణ సూత్రాలే అయినా..ఎందులోనైనా పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఇవి అత్యంత కీలకం అనే విషయం గ్రహించాలి. ఇక అష్నీర్‌ బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది పోషకాహారం. కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య భోజనమేనని చెబుతున్నారు. 

దీంతోపాటు వ్యాయమం కూడా బరువు తగ్గేందుకు హెల్ప్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు. దీన్ని బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా పేర్కొన్నారు. కేలరీలు బర్న్‌ చేయడానికి, లీన్‌ కండరాలను నిర్మించడానికి, బొడ్డు కొవ్వుని తగ్గించుకోవడానికి, మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, స్థిరమైన ఫలితాలు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ 43 ఏళ్ల వ్యాపారవేత్త వెయిట్‌ లాస్‌ అవ్వడంలో ఆహారం, సుదీర్ఘ నడక, అంగుళం నుంచి కిలో గ్రాముల బరువు తగ్గేందుకు దారితీస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

అంతేగాదు ఆరోగ్యకరమైన ఆహారం బరవు తగ్గడంలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటని న్యూట్రిషన్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో పేర్కొంది. ప్రోటీన్‌ , కార్బోహైడ్రేట్ ఆహారాలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడానికి హెల్ప్‌ అవ్వడమేగాక, అదుపులో ఉంచుకోగలుగుతామని పలు అధ్యయనాల్లో తేలింది. దీనికి కావల్సిందల్ల క్రమశిక్షతో కూడిన జీవనశైలి, వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లేనని ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్‌ తన స్వీయానుభవంతో వెల్లడించారు.  

(చదవండి: హాలీవుడ్‌ మోడల్‌గా ఈ-రిక్షాడ్రైవర్‌..!)

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)