Breaking News

బస్సు డ్రైవర్‌ కూతురుకి లండన్‌లో ఉద్యోగం!

Published on Sat, 08/05/2023 - 14:43

ఆమె నక్సల్స్‌తో హడలెత్తిపోయే ఊరు నుంచి మొదలైంది ఆమె బాల్యం. ఆమె చదువు కటిక దారిద్యం, నక్సల్స్‌ బెడద మధ్య భయం భయంగా సాగింది. అయినా వెరవక ఉన్నత చదువులు చదవడమే గాక ఏకంగా లండన్‌లో ఉద్యోగం కొట్టి.. ఔరా! అనిపించుకుంది ఓ బస్సు డ్రైవర్‌ కూతురు. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె స్ఫూర్తివంతమైన విజయగాథ ఎలా సాగిందంటే..

చత్తీస్‌గఢ్‌ జిల్లాలోని సుక్మా జిల్లాలో నక్సల్స్‌ బాధిత దోర్నపాల్‌కి చెందిన బస్సు డ్రైవర్‌ కూతురు రియా ఫిలిప్‌. ఆ ప్రాంతం అంతా తీవ్రవాదుల భయం ఎక్కువ. ఎప్పుడూ పోలీసుల కర్ఫ్యూల, తుపాకీ మోతలు, ఆర్తనాదాలతో అట్టుడుకిపోతుండేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చించి రియా. అయినప్పటికీ బతుకు ప్రయాణం సాఫీగా సాగాలంటే ఒక్కటే ఆయుధం చదువు అని స్ట్రాంగ్‌ డిసైడ్‌ అయ్యింది. ఎన్ని భయాలు ముందున్నా వెరవక చదువుపై దృష్టి పెట్టింది. ఆమె తల్లి షోలీ ఫిలిప్‌ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ కాగా, తండ్రి రితేష్‌ ఫిలిప్‌ అదే స్కూల్‌లో బస్సు డ్రైవర్‌.

మధ్య తరగతి కుటంబం అయినా తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. పిల్లల చదువు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఆ జంట వెనుకాడలేదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివారు. అయితే ఆ కుటుంబ నక్సల్స్‌ భయంతో దుబ్బతోట గ్రామం నుంచి దోర్నపాల్‌కి తరలి వెళ్లిపోవడంతో తీవ్రమైన కష్టాల్లోకి కూరుకుపోయారు. అయినా పిల్లల చదువులకు మాత్రం ఎలాంటి ఆటంకం రానివ్వలేదు. అలాగే రియా కూడా వారి ఆశను ఒమ్ము కానియ్యకుండా బాగా చదవడమే గాక ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది.

అక్కడ రెండేళ్ల పాటు సేవలందించింది.  అలా సాగిన ఆమె ప్రయాణం యూకేలో ఉద్యోగం సంపాదించే స్థాయికి  చేరుకుంది. చివరికి రియాకు లండన్‌లో మంచి ఉద్యోగం ఆఫర్‌ వచ్చింది. ఐతే ఆమె లండన్‌ వెళ్లేందుకు తల్లిదండ్రులు ఇంటిని తాకట్టుపెట్టి మరీ రూ 3 లక్షలు సమకూర్చారు. ఏమైతేనేం ఎన్నో కష్టాలను ఈదుకుంటూ..ఆమె లండన్‌లో ఏకంగా 21 లక్షల వార్షిక ప్యాకేజితో మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. పైగా ఆమె తల్లిదండ్రులు కూతురు నెలవారి జీతం రూ లక్ష ఎనభై వేలని గర్వంగా చెప్పుకునేలా చేసింది.

రియా విజయగాధని చూసి ఆమె బంధువులు కుటుంబ సభ్యులకి  గర్వాన్ని కలిగించడమే గాక ఆమె జిల్లాలోని విద్యా వ్యవస్థ మెరుగపడేందుకు ప్రేరణ ఇవ్వడం విశేషం. ఇక కుటుంబం మద్దుతు ఉంటే ఏదైనా సాధించవచ్చని అంటోంది రియా. అదే సమయంలో విజయం అం‍దుకోవాలంటే మన వద్ద సహనం, పట్టుదల తోపాటు అంకితభావం ఉండటం అత్యంత ముఖ్యం అని రియా పేర్కొంది. 

(చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్‌ కలకలం..భయం​ గుప్పెట్లో దేశాలు!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)