DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
ఒక టెక్నికల్ లోపం.. ప్రపంచానికి కొత్త ప్యాకింగ్ సొల్యూషన్!
Published on Sat, 09/05/2026 - 09:11
బబుల్ రాప్.. ఈ రోజుల్లో దీని పాత్ర చెప్పలేనిది. ఆన్‌లైన్ షాపింగ్ వచ్చాక ప్యాకేజింగ్‌లో దీని అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, గాజు వస్తువులు ఒక్కటేమిటీ ప్రతీ వస్తువుకు రక్షణ కవచంలా మారిపోయింది. మరి ఇంతలా వినియోగిస్తున్న ఈ బబుల్ రాప్ కవర్..
మీకు తెలుసా?
బబుల్ రాప్ కథ అమెరికాలోని న్యూజెర్సీలో 1957లో మొదలైంది. ఆల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చవాన్నెస్ అనే ఇద్దరు ఇంజనీర్లు తమ గ్యారేజీలో పని చేస్తూ.. గోడలకు ఒక కొత్త స్టైల్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వాల్‌పేపర్‌ను తయారు చేయాలని భావించారు. దీని కోసం రెండు ప్లాస్టిక్ షీట్లను ఒక యంత్రం సాయంతో అతికించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు, యంత్రంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండు ప్లాస్టిక్ షీట్ల మధ్య చిన్నచిన్న గాలి బుడగలు చిక్కుకుపోయాయి. బయటకు వచ్చిన షీట్ సాదాగా కాకుండా, బుడగలతో నిండి ఉంది. అయితే ఈ బుడగల వాల్ పేపర్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు.
1960లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బబుల్ రాప్‌కి మంచిరోజులొచ్చాయి. అప్పట్లో ఐబీఎం సంస్థ 1401 కంప్యూటర్‌ను లాంచ్ చేసింది. అది చాలా సున్నితమైన యంత్రం, కాబట్టి దానిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. అప్పుడు మార్క్ చవాన్నెస్ ఈ బబుల్ ప్లాస్టిక్‌ను ఆ సంస్థకి చూపించారు. ఆ గాలి బుడగలు వస్తువులకు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఐబీఎం ఇంజనీర్లు గుర్తించారు. అలా తమ కంప్యూటర్లను సురక్షితంగా రవాణా చేయడానికి దీనిని వాడటం మొదలుపెట్టారు. దీంతో బబుల్ రాప్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నేటి ఈ–కామర్స్ కాలంలో ఈ బబుల్ రాప్ లేని పార్సిల్స్‌ను ఊహించడం అసాధ్యం.
ఇవి కూడా చదవండి: నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా?
Tags : 1