Breaking News

మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!

Published on Wed, 07/15/2026 - 11:34

ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ పారిశ్రామికవేత్త, బయోహ్యాకర్ బ్రియన్ జాన్సన్ ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి..దీర్ఘాయువతో ఉండాలనే ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచాడు. 18 ఏళ్ల యువకుడి ఫిట్‌నెస్‌ సాధించడమే లక్ష్యంగా తనమీద ప్రయోగాలు చేసుకున్నాడు. అందుకోసం కోట్లు ఖర్చుచేశాడు. నిత్యం తన చుట్టూ వేలాది డాక్టర్లు నియమించి ప్రతి అణువణువు శోధించి ఎన్నో ప్రయోగాలకు తెర తీశాడు. చివరికి విషాదకరంగా అతడే తనను తినేసే దీర్ఘకాలిక వ్యాధి భారిన పడ్డాడు. నిజానికి ఆ వ్యాధికి శాశ్వత నివారణ లేదు కేవలం మందులు, చక్కటి ఆహారంతోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలేంటి వ్యాధి. ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా.!.

ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో మన రోగనిరోధక వ్యవస్థ (immune system) పొరపాటున కడుపులోని ఆమ్లాలను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. దీనివల్ల కడుపులో నొప్పి, వికారం, విటమిన్ బి-12, ఐరన్ లోపాలు ఏర్పడతాయి.

ఎందువల్ల వస్తుందంటే..
ఈ పరిస్థితి వంశపారంపర్యంగా రావచ్చు లేదా టైప్ 1 డయాబెటిస్, థైరాయిడ్ (హాషిమోటోస్) వంటి ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణాలు గురించి తెలియాల్సి ఉంది. కానీ వైద్యులు దీన్ని సాధారణంగా జన్యుపరమైన లోపాలు, రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల కలయిక వల్ల ఇది వస్తుందని నమ్ముతారు.

లక్షణాలు..
ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కడుపు ఉబ్బరం, అజీర్తి, అలసట, రక్తహీనత (Pernicious anemia) వంటివి కాలక్రమేణా బయటపడతాయి. 

ప్రమాదకరమా..?
ఇది నెమ్మదిగా, చాలా సంవత్సరాల పాటు సాగే దీర్ఘకాలిక ప్రక్రియ. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన నరాల బలహీనత, ఎముకలు బలహీనపడటం, తీవ్రమైన రక్తహీనతకు దారితీస్తుంది. అంతేకాకుండా, కడుపులో దీర్ఘకాలికంగా ఉండే వాపు వల్ల భవిష్యత్తులో:

​కడుపులో పాలిప్స్
గ్యాస్ట్రిక్ న్యూరోఎండోక్రిన్ కణితులు
కడుపు కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ అవసరం.

నిర్ధారణ:

ఎండోస్కోపీ, బయాప్సీ: పొట్ట లోపలి భాగాన్ని పరిశీలించి, కణజాల నమూనాలను పరీక్షించడం ద్వారా నిర్ధారిస్తారు.

రక్త పరీక్షలు: విటమిన్ బి12, ఐరన్, ఆటోయాంటీబాడీస్ స్థాయిలను తనిఖీ చేస్తారు.

చికిత్స: 
ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్‌ను పూర్తిగా నయం చేయడానికి శాశ్వత నివారణ (Cure) లేదు, కానీ సరైన వైద్య సంరక్షణతో దీనిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. కడుపులో తగ్గిన పోషకాలను, ముఖ్యంగా విటమిన్ బి12 ఇంజెక్షన్లు లేదా సప్లిమెంట్ల ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోగలరని చెబుతున్నారు. 

అలాగే క్రమం తప్పకుండా  ఏడాదికి ఒకసారి లేదా డాక్టర్ సూచించిన టైమ్‌లో బ్లడ్ టెస్టులు, పీరియాడిక్ ఎండోస్కోపీ చేయించుకోవాలి. దీంతో కడుపులో కేన్సర్ లేదా కణితులు వంటి ముందస్తు మార్పుల్ని త్వరగా గుర్తించి ప్రాణాపాయం తప్పించవచ్చు.

కాగా బ్రయాన్‌ ప్రజలంతా తన అనారోగ్యాన్ని సంబరంగా జరుపుకుంటున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తాను మరణ భయాలను పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టి తన మీదే ప్రయోగాలు చేస్తే..దాన్ని దురుద్దేశంగా చూస్తూ తగిన శాస్తి జరిగిందని చాలామంది సంబరపడుతున్నారని అన్నారు.

ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నావారిని ఈ ప్రపంచం ఇలానే చూస్తుందని, వాళ్లకు ఎదురైన ఓటమి లేదా దురదృష్టాన్ని ఇలానే చిత్రీకరిస్తుందని ఆవేదనగా చెప్పారు. తన ప్రయత్నాలు విఫలమైనా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఓ కొత్త మార్గాన్ని అందించింది, అలాగే రానున్న రోజుల్లో బహుశా మరణం అనివార్యం కాకపోవచ్చు అని బ్రయాన్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం.

 

(చదవండి: వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)