భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..

Published on Sun, 10/12/2025 - 12:37

ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్‌ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. 

సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ  ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. 

బ్రిటిష్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నిక్‌ బుకర్‌ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్‌ చేసుకునే నిక్‌ బుకర్‌ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆ వీడియోలో నిక్‌ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్‌ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్‌ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. 

అంతేగాదు కర్వా చౌత్‌ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్‌ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు.

 

(చదవండి: 'ఖతర్నాక్‌ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!)

 

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)