Breaking News

తండ్రి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చుతో.. బ్రిడ్జ్‌ నిర్మాణం..

Published on Fri, 07/07/2023 - 15:51

మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్‌పెట్టి శభాష్‌ అనిపించుకున్నాడు సుధీర్‌ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు. 

వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్‌ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్‌ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్‌. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్‌ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్‌ అ‍్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్‌ ఝా మరణించాడు.

కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం..
అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్‌ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్‌ ఝా అలియాస్‌ సుధీర్‌ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు.

తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్‌ ఝా సోదరుడు మహవీర్‌ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్‌ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్‌ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు.

(చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!)

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)