Breaking News

తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్‌ ఏంటంటే..

Published on Mon, 01/13/2025 - 12:32

కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతు‍ర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.

ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్‌ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా‌ ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. 

ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్‌ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు".

 

(చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)