Breaking News

పెళ్లికూతురు డ్యాన్స్‌, నోట్ల వర్షం: చివరికి ఏమైందంటే..!

Published on Sat, 03/08/2025 - 17:41

భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవూ ఉండదు. అలాగే  వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలాకామన్‌.  ట్రెండింగ్‌లో ఉండే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్‌మీడియాను షేక్‌ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా  వధువు వార్తల్లో నిలిచింది.  ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్ అవుతోంది.  స్టోరీ ఏమిటంటే..

డిజైనర్‌ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తోంది. జరీ వర్క్‌చేసిన ఎరుపు రంగు లెహంగా, దుప్పట్టా, హారాలు, సరిపోయే చెవిపోగులు, చూడమణితో చూడముచ్చటగా  ఉన్న ఆమెను  అందరూ  ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో   కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది.  నృత్యం చేయడం ఆపి, గౌరవంగా తల వంచుకుని, నిశ్శబ్దంగా  పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది.  నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

 అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. ఇది చాలాచోట్ల సాధారణమైనప్పటికీ, ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు,  "చాలా అందంగా.. తన సంతోషంగా నృత్యం చేస్తోంది....ఆమె ఇతరులను సంతోష పెట్టడం కోసం కాదు, తనకోసం ఆనందంగా నృత్యం చేస్తోంది. వాళ్ కానీ డబ్బులు విసరడం  ఎందుకు,  అందుకే ఆమె  ఆపేసింది అని మరొకరు రాశారు. 'అత్యంత అందమైన వధువు' అని మరికొందరు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా?  ప్రశ్నించారు.మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాల  చుట్టూ చర్చకు దారితీసిందీ ఘటన.

చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్‌ యాక్షన్‌ అంటే? మాటలేనా!

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)