Breaking News

బీచ్ వెడ్డింగ్‌, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్‌

Published on Thu, 10/17/2024 - 12:02

భారతదేశంలో పెళ్లిళ్లు   అంటే  వేదమంత్రాలు, బాజా భజంత్రీలు, మూడు  ముళ్లు,ఏడడగులు మాత్రమే కాదు. అంతకుమించి పెద్ద సందడే  ఉండాలి.  విశాలమైన వెడ్డింగ్‌ హాల్స్‌,  జిగేల్‌ మనిపించే డెకరేషన్‌, నోరూరించే వంటకాలు, మెహిందీ, సంగీత్‌, బారాత్‌..నాచ్‌గానా మినిమం ఉండలి. ఇక వీటన్నింటికి మంచి వధువు డిజైనర్‌ దుస్తులు, ధగధగలాడే ఆభరణాలతో అదిరిపోవాలి. ఇదీ  లేటెస్ట్‌ ట్రెండ్‌. తాజాగా  బీచ్‌ వెడ్డింగ్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా  మారింది.

విశేషం ఏమిటంటే..  ఈ పెళ్లిలో వధువు తన లహంగాను స్వయంగా తానే డిజైన్‌ చేసింది. ఆమె పేరే కాశీష్ అగర్వాల్‌. పారిశ్రామికవేత్త అసీమ్ ఛబ్రాతో థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్‌లో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.  వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్‌ బాగా వైరల్‌అవుతున్నాయి. 

ముఖ్యంగా వైట్‌ లెహంగా స్కర్ట్‌లో రాధా-కృష్ణల ప్రేమకథను పిచ్వాయ్  పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. తన పిన్ని, వృత్తిరీత్యా డిజైనర్  షాగున్ పాఠక్ సహాయంతో  దీన్ని అద్భుతంగా అపురూపంగా తయారు చేసిందట కాశీష్‌.  ఇక  భారీ చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ చెవిపోగులు, చూడామణి, చేతి నిండా గాజులు, అంగుళీయంతో మెరిసిపోతున్న పెళ్లికూతురు వైపునుంచి చూపు తిప్పుకోలేకపోయారట అతిథులు 
 

వీరి లవ్‌స్టోరీ
కరోనా సమయంలో పెద్దల ద్వారా వీరి పరిచయం సాగింది. కరోనాతో తమ్ముడిని కోల్పోయిన బాధలో  కాశీష్‌, వ్యాపార నష్టాలతో ఉన్న అసీమ్‌ మానసికంగా బాగా దగ్గరయ్యారు.  ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలైనప్పటికీ ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ వీర ప్రేమికులుగా మారి పోయారు. ఎట్టకేలకు  పెళ్లికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. మెహందీ, సంగీత్‌, ఇలా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు గ్రాండ్‌గా నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కాబోయే  వధూవరులను బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)