Breaking News

పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!

Published on Sun, 06/01/2025 - 11:35

నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?
– రమణి, శ్రీకాకుళం. 

మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్‌ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్‌ మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోండి. 

మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్‌ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్‌ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్‌ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్‌గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్‌ అని అర్థం. 

ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్‌ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్‌ లేబర్‌ పెయిన్స్‌ అని అర్థం. 

అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్‌ లేదా వాటర్‌ లీక్‌ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్‌ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్‌బీట్, ఇంటర్నల్‌ ఎగ్జామినేషన్‌ చెక్‌ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేస్తారు. ఫాల్స్‌ లేబర్‌ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.

నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్‌ క్రాక్స్‌ వస్తున్నాయి. బ్లడ్‌ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
– లావణ్య, తిరుపతి. 

బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్‌ ఫీడింగ్‌లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్‌ క్రాక్స్‌ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. 

పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్‌ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్‌ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్‌ సర్కులేషన్‌ వస్తుంది. వ్యాసలిన్‌ లేదా పారాఫిన్‌  లేదా ప్యూరిఫైడ్‌ లోషన్‌తో నిపుల్‌ మీద మసాజ్‌ చెయ్యాలి. 

ఇలా ప్రతి ఫీడ్‌ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్‌కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్‌ ఇవ్వండి. బ్రెస్ట్‌ ప్యాడ్స్‌ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్‌ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్‌ కాకుండా ప్రివెంట్‌ చెయ్యడానికి ఫీడ్‌ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్‌ మిల్క్‌ ఎక్స్‌ప్రెస్‌ చేసి నిపుల్‌ మీద రాసి, తరువాత కవర్‌ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్‌ రాకుండా ఉంటాయి. 

నిపుల్‌ షీల్డ్‌ అని మెడికల్‌ షాప్స్‌లో రబ్బర్‌ కవరింగ్స్‌ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్‌ ఎక్కువ ఉండి, బ్లీడింగ్‌ అవుతుంటే క్రీమ్స్‌ రాసి దాని తరువాత సరైన సైజ్‌లోని షీల్డ్‌ పెట్టి ఫీడింగ్‌ ఇస్తే నిపుల్‌కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్‌ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, నిపుల్‌ క్రాక్స్‌ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్‌కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్‌కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్‌ పొజిషన్‌ కూడా చాలా ముఖ్యం. 

రొమ్ముల ఐరోలా, నిపుల్‌ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్‌ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్‌ క్రాక్స్‌ తగ్గుతాయి. నిపుల్‌ ఒక్కటే పట్టుకొని సక్‌ చేస్తే క్రాక్స్‌ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్‌ కన్సలెంట్‌ని కలసి మీకు పొజిషన్స్‌ ఫర్‌ ఫీడింగ్‌ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్‌ బాగా వస్తుంది, నిపుల్‌ క్రాక్స్‌ తగ్గుతాయి. 
డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: '2 పర్‌ 20 వాకింగ్‌ రూల్‌' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..)
 

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)