Breaking News

ఇదేనా ఆధునిక నాగరికత?

Published on Sun, 07/27/2025 - 10:52

హిందూ పురాణాలు, భారతీయుల నమ్మకం ప్రకారం... జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ( Goddess Saraswati) పుస్తక రూపంగా భావిస్తారు. పుస్తకం జీవన దీపికగా, నిత్యం మనకు సత్యా– అసత్యాల వాస్తవ మార్గాన్ని చూపిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే దారిగా నిలుస్తుంది. సంస్కృతంలో ప్రసిద్ధమైన మాట ‘పుస్తకం హస్త భూషణం’. అంటే పుస్తకం చేతికి అలంకారమని అర్థం. పుస్తకం ఉత్తమ మిత్రుడు, గురువు, తత్వవేత్త కూడా. ‘అపరిమితంగా చదివినవాడే గొప్ప వాగ్ధాటి గల వక్త కాగలడు’ అన్న మాట పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. నిస్సందేహంగా, ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అమోఘం. రాతియుగం నుండి నేటి జనరేటివ్‌ ఏఐ యుగం వరకు మనల్ని నడిపించింది పుస్తకం. ఇది మన నాగరికత, శాస్త్రీయ పురోగతికి పునాది వేసినది.

అయితే నేడు పుస్తకాలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పుస్తకాలను నగరాల్లోని ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై అమ్మడం తెలిసిందే. కానీ పాదరక్షలను ఎయిర్‌ కండిషన్డ్‌ షోరూమ్‌లలో ఉంచి అమ్ముతున్నారు. ఇది చేదు వాస్తవం అయినప్పటికీ, ఎవ్వరూ ఖండించలేని పచ్చి నిజం. విద్యాసంస్థలు దేవాలయాలు అయితే, గ్రంథాలయాలు సాక్షాత్తూ గర్భగుడులే. గర్భగుడిలో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. అందువల్ల పుస్తకాలను గౌరవంగా ప్రార్థన గదిలో కాకపోయినా, పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా గౌరవించాలి. 

చదవండి: చదివింది పదో తరగతే... కట్‌ చేస్తే కోట్లలో సంపాదన

ఈ మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నాగరికతా? సంస్కృతా?ఆధునికీకరణ పేరుతో, మనం స్నానపు గదిలో వంట చేయలేము; వంట గదిలో స్నానం చేయలేము అనే కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఈ కార్యకలా పాలన్నీ ఇంట్లో వాటికి కేటాయించిన ప్రదేశాలలో జరగాలి. విలాసాలు, వినోదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు కానీ వంద రూపాయలు ఖర్చుచేసి ఒక పుస్తకం కొనడానికి సంకోచిస్తున్నాడు మనిషి. పుస్తకాలకు (జ్ఞానానికి) మళ్ళీ తగిన స్థానం కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని ‘విద్యావంతులైన మూర్ఖులు’గా చరిత్ర పుటల్లో గుర్తుంచుకుంటాయి.

– రెడ్డి శేఖర్‌ రెడ్డి గుడిశ
 ఇంగ్లిష్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు