Breaking News

అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?

Published on Mon, 10/07/2024 - 15:46

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అ‍న్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు  మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఒక ప్రకటన ఇచ్చాడు.  తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు.  అంతేకాదు  ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది.   ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల  ఇన్వెస్టర్‌  పెళ్లి ప్రకటన వివరాలు  ఇలా ఉన్నాయి
ఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం  ప్రతీ ఏడాదీ 54 శాతం  వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది.  

తాను స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను  ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు.    

ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ కూడా  నా దగ్గర ఉందంటూ ఊరించాడు.   "సురక్షిత పెట్టుబడి"కి  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ అంటూ ఆఫర్ చేశాడు.  ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్‌ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.

మాజీ-బ్యాంకర్  సమిత్ సింగ్  ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు. దీంతో నెటిజన్లు  అంతా బిజినెస్‌ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్‌ (స్టాక్‌మార్కెట్లో షేర్‌ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్‌లా కనిపిస్తున్నాడు అని   ఒకరు,  విన్‌-విన్‌ సిట్యువేషన్‌ని టార్గెట్‌ చేసినట్టున్నాడు,   అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం  రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్‌ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు  తొందర్లోనే వారెన్‌ బఫెట్‌ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్‌ లేదట.. అంటే కాల్‌ ఆప్షన్‌’’ అన్నమాట,  ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్‌ పోస్ట్‌ చేశారు. మొత్తానికి పీపీటి కమ్‌, మేట్రిమోనియల్‌యాడ్‌  ఇంటర్నెట్‌లో  హల్‌చల్‌ చేస్తోంది. 
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)