Breaking News

పసి మొగ్గల.. బర్త్‌డే గార్డెన్

Published on Sat, 08/16/2025 - 14:10

సాక్షి, సిద్దిపేట: పుట్టినరోజు వస్తుందంటేనే పిల్లలు ఎక్కడ లేని సంతోషంలో మునిగిపోతారు. బర్త్‌డే  రోజు ఒక మంచిపని చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ ఆలోచనలోంచి అందమైన బర్త్‌ డే గార్డెన్‌లు పురుడు పోసుకున్నాయి. సిద్దిపేట జిల్లా బక్రి చేప్యాల జెడ్పీఉన్నత పాఠశాలతోపాటు దుబ్బాకలోని లచ్చపేట మోడల్‌ స్కూల్‌లోని విద్యార్థుల బర్త్‌ డే గార్డెన్‌లు (Birthday Garden) అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బక్రి చేప్యాల పాఠశాల ఉపాధ్యాయులు, లచ్చపేట మోడల్‌ స్కూల్‌ సీసీఆర్‌టీ (సెంటర్‌ ఫర్‌ కల్చరల్, రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌) క్లబ్‌ ఈ ఏడాది జూన్‌ 16న బర్త్‌ డే గార్డెన్‌లు ఏర్పాటు చేశాయి.

పాఠశాలల్లో ఎవరి పుట్టిన రోజు ఎప్పుడు అనేది  తెలుసుకునేందుకు ప్రత్యేక రికార్డు బుక్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజు నాడు వారిచేత టీచర్ల గార్డెన్‌లో మొక్కను నాటిస్తున్నారు. ప్రతీ రోజు బ్రేక్‌ సమయంలో ఎవరి మొక్కకు ఆ విద్యార్థి నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి టీచర్లు కూడా తమ పుట్టిన రోజు సందర్భంగా గార్డెన్‌లో మొక్కలు నాటుతున్నారు. గార్డెన్ల పర్య వేక్షణ బాధ్యతను ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీచర్లకు అప్పగించారు.

పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంచాలని..
బర్త్‌ డే అంటే కేక్‌ కట్‌ చేయటం, చాక్లెట్లు పంచటమే కాదు... మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో బర్త్‌డే గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో పర్యావరణం పట్ల బాధ్యత, ప్రేమ పెంచాలనే దీనిని ప్రారంభించాం. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేలా ప్రయత్నిస్తున్నాం. గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి మొక్కలు (Plants) తెప్పించి నాటిస్తున్నాం.        
– నాగేందర్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బక్రి చేప్యాల

పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాను
మా పాఠశాలలో ఏర్పాటుచేసిన బర్త్‌ డే గార్డెన్‌లో నా 14వ బర్త్‌డే సందర్భంగా గులాబీ మొక్కను నాటాను. రోజూ బ్రేక్‌ సమయంలో మొక్కకు నీళ్లు పోస్తున్నా. బర్త్‌ డే రోజు మొక్క నాటడం ఎంతో సంతోషంగా ఉంది. 
– రక్షిత, 9వ తరగతి, బక్రి చేప్యాల 

చ‌ద‌వండి: య‌స్‌.. ఇది గ‌ణేష్‌ బండి.. ఏం చేశాడో చూడండి!

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)