Breaking News

మైఖేల్‌ జాక్సన్‌ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..!

Published on Thu, 09/11/2025 - 17:09

ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్‌ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్‌ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్‌ డ్యాన్స్‌లకు పేరుగాంచిన పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. 

ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్‌ పక్షి అచ్చం మేఖేల్‌ జాక్సన్‌ చేసిన మూన్‌వాక్‌ డ్యాన్స్‌ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్‌ స్టెప్‌లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్‌ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్‌కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. 

కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి మరి..!..

(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)

 

Videos

Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్

Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!

Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

Photos

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)