Breaking News

అతుల్ సుభాష్‌కు బిల్లు నివాళి..!

Published on Wed, 12/18/2024 - 14:04

అతుల్‌ సుభాష్‌ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్‌ సుభాష్‌ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. 

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్‌టాపిక్‌ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్‌ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్‌కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్‌గా మారింది.  

హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కి  ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్‌ ఫర్‌ అతుల్‌ సుభాష్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. 

ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం.  

అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ  యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ ‍​వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: గట్‌ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)