Breaking News

ఇవి నిజంగానే 'గజ' నిమ్మకాయలు!

Published on Tue, 12/26/2023 - 12:40

సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్‌లో  నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..?

కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్‌ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్‌లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు.

ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్‌లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి.

సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు.

(చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)