Breaking News

స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్‌!.. జస్ట్‌ నాలుగు నెలల్లో ఏకంగా..!

Published on Thu, 07/18/2024 - 16:00

బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌ ఎంత లావుగా ఉండేదో అందరకీ తెలిసిందే. ఆమె తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా కోసం 32 కిలోలు పెరిగి ట్రోలింగ్‌కి గురయ్యింది. ఆ మూవీలో ఆమె అధిక బరువుతో ఉండే భార్య పాత్రను పోషించింది. అయితే ఆమె సినిమా షూటింగ్‌ అయిపోయిన వెంటనే బరువు తగ్గే ఫిట్‌నెస్‌ ప్రయాణంపై దృష్టిసారించింది. అయితే అనేహ్యంగా జస్ట్‌ 4 నెలల్లోనే మంచిగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు అందుకు తనకు ఉపకరించిన డైట్‌ ప్లాన్‌లు, ఫిట్‌నెస్‌ చిట్కాలను కూడా చెప్పుకొచ్చింది. అవేంటంటే..

భూమి ఫడ్నేకర్‌ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే క్రమాన్ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయలేదట. నచ్చినవన్నీ మితంగా తీసుకుంటూ ఉండేది. ప్రధానంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా గుడ్లు, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్‌గిరా వంటి ఫుడ్స్‌ తీసుకునేది. ఉదయ స్కిమ్డ్‌ పాల తోపాటు ముసేలి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. 

మధ్యాహ్న భోజనంలో పప్పుతో కూడిన ఆహారం తప్పక తీసుకున్నట్లు పేర్కొంది. ఇ‍క సాయంత్రం స్నాక్స్‌, కప్పు గ్రీన్‌ టీ తోపాటు పండ్లు ఉండాల్సిందే. అలాగే బాదం, వాల్‌నట్‌లను తినేందుకు ఇష్టపడేది. రాత్రి 8.30 గంటలకు డిన్నర్‌ చేయడానికి ఇష్టపడేది. అయితే భోజనంలో కాల్చిన చేపలు, చికెన్‌, పనీర్‌, టోపు, ఉడికించిన కూరగాయలను తీసుకున్నట్లు వివరించింది భూమి. 

వర్కౌట్‌లు..
భూమి హై ఇంటెన్సిటీ కసరత్తుల జోలికి పోలేదు. కానీ పరిగెత్తడం, ఫంక్షనల్‌ శిక్షణ, స్విమ్మింగ్‌, డ్యాన్స్‌, ఏరోబిక్స్‌, వంటి వ్యాయామాలు చేసింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఫిట్‌గా ఉండేలా కార్డియో, వెయిట్‌ లిఫ్టింగ్‌, పైలేట్స్‌, స్ట్రెచింగ్‌లను వంటివి చేస్తూనే ఉంది. 

అయితే షుగర్‌కి మాత్రం దూరంగానే ఉంది. తొందరగా బరువు తగ్గేలా అన్ని రకాల స్వీట్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది భూమి. అలాగే రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించింది. ఇక ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగేది.  ఈ విధమైన డైట్‌ ప్లాన్‌ల తోపాటు మంచి ఆహారపు అలవాట్లతో అభిమానులే గుర్తుపట్లలేనంత స్లిమ్‌గా అందంగా మారిపోయింది భూమి. 

(చదవండి: ముత్యాలతో చేసిన చీరలో షానాయ​ కపూర్‌..! ఏకంగా 'లక్ష'..!)

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)