Breaking News

ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్‌

Published on Sat, 07/05/2025 - 16:06

ప్రముఖ కన్నడ నటి తన జీవితంలో  ఒకముఖ్యమైన అంశం గురించి  ఫ్యాన్స్‌తో షేర్‌ చేసింది. 40 ఏళ్ల వయసులో బిడ్డల్ని కంటున్నాను అంటూ ప్రకటించింది. తద్వారా తాను పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు  ప్రేరణగా నిలవ బోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంతకీ ఎవరా నటి? ఎందుకు సింగిల్‌ మదర్‌గా ఉండాలనే  సాహసోపేత నిర్ణయం తీసుకుంది? 

 భావన రామన్న  తాను గర్భం దాల్చినట్టు  తెలిపింది. ఐవీఎఫ్‌(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నా అంటూ ఒక ధీర ప్రకటన  చేసింది నటి భావన. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆరు నెలల  బేబీ బంప్‌తో రెండు చిత్రాలను పోస్ట్ చేసింది.  చాలా మంది మహిళల బిడ్డను కనాలనే కలలకు తాను ప్రతిరూపమంటూ ఈ భావోద్వేప్రయాణం ఎలా ఒడిదుడుకులతో నిండి ఉందో పంచుకుంది. ఒంటరి మహిళగా తన ప్రయాణాన్ని  షేర్‌ చేసింది.

ఇదీ చదవండి : రెండే రెండు టిప్స్‌ : 120 కిలోల నుంచి స్మార్ట్‌ అండ్‌ స్లిమ్‌గా
 

"ఇదొ కొత్త అధ్యాయం, ఇది నేను ఊహించలేదు.  కవలలతో ఆరు నెలల గర్భవతిని. 20-30 ఏళ్లపుడు తల్లినవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ నాకు 40 ఏళ్లు నిండిన తరువాత ఆ కోరికను కాదనలేకపోయా. ఇపుడు  ఇద్దరికి జన్మనివ్వబోతున్నా..అదీ ఒంటరి మహిళగా. ఈ జర్నీ అంత  సులభంగా సాగలేదు. చాలా IVF క్లినిక్‌లు, వైద్యులు  నన్ను తిరస్కరించారు.’’ అయినా సాధించాను. "తన పిల్లలకు తండ్రి ఉండరని  తెలుసు, కానీ వారు కళ, సంగీతం, సంస్కృతి, ఎల్లలులేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. ఏంతో ప్రేమగా నమ్మకమైన  చేతుల్లో  పెరుగుతారు’’ అని తెలిపింది. అలాగే ఇంత కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన, తల్లిదండ్రులు, తోబుట్టువులకు,  డాక్టర్ సుష్మకు భావన కృతజ్ఞతలు తెలిపింది. ‘‘ఇదేదో తిరుగుబాటుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కోరికను గౌరవించడానికే ఈ నిర్ణయం. నా స్టోరీ  కనీసం ఒక  మహిళను ఇన్‌స్పైర్‌ చేసినా అది చాలు నాకు.’’ అని పేర్కొనడం విశేషం.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)