Breaking News

అదే నా సూపర్ పవర్!

Published on Sun, 05/24/2026 - 00:57

జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, 
అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకుంది...

సెన్సిటివ్‌ గర్ల్‌ని
నేను చాలా సెన్సిటివ్‌. చిన్న విషయానికే  వెంటనే ఎమోషనల్‌ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్‌ పవర్‌. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను.

బాడీ పాజిటివిటీ
ప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు.

ఫ్యామిలీ ఫస్ట్‌
ఎంత బిజీగా ఉన్నా, పండుగల టైమ్‌లో మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే. ముఖ్యంగా వినాయక చవితి అంటే మా ఇంట్లో చాలా సందడి ఉంటుంది. ఆ టైమ్‌లో షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీ, నా పెట్‌ డాగ్‌ ‘జియో’తో గడుపుతాను. ప్రస్తుతం కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాను. నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే పాత్రలు చేయాలని ఉంది.

గ్లోబల్‌ చైల్డ్‌హుడ్‌
నేను పుట్టింది మహారాష్ట్రలో అయినా, స్కూలింగ్‌ అంతా నైజీరియాలో గడిచింది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి ముంబైకి వచ్చాను. అప్పుడే మోడలింగ్‌ వైపు వెళ్లమని అందరూ ఎంకరేజ్‌ చేశారు. ‘అయ్యో, వచ్చిన అవకాశాలను వదులుకున్నానే’ అని బాధపడకూడదనే సినిమాల్లోకి వచ్చాను. అలా నా ప్రయాణం విధి రాసిపెట్టినట్టు సాగుతోంది.

రిజెక్షన్‌ నుంచే సక్సెస్‌!
కెరీర్‌ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్‌ నుంచి బయటకు వచ్చి, డ్రెస్‌ మార్చుకుని, మళ్లీ డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లి నన్ను నేను ప్రూవ్‌ చేసుకున్నాను. జీవితంలో రబ్బర్‌ బాల్‌లా ఎంత గట్టిగా కింద పడితే అంతకంటే వేగంగా పైకి ఎగరాలి.

డ్యాన్స్  రాదు!
మా అమ్మ డ్యాన్స్  టీచర్‌ అయినా, చిన్నప్పుడు నాకు డ్యాన్స్  సరిగ్గా రాకపోయేది. అందరూ నన్ను ఏడిపించేవారు. కానీ పట్టుదలతో నేర్చుకున్నాను. అలాగే ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పాలని పట్టుబట్టాను.

రింగ్‌ మిస్టరీ
నా వేలికి ఉన్న రింగ్‌ గురించి చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? ఎవరిచ్చారు? అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. అది నాకు నేను కొనుకున్న గిఫ్ట్‌. 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)